కాంగ్రెస్​ వార్ ​రూమ్ కు కోఆర్డినేటర్ల నియామకం

కాంగ్రెస్​ వార్ ​రూమ్ కు కోఆర్డినేటర్ల నియామకం

హైదరాబాద్​, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ వార్​ రూమ్ కు కో ఆర్డినేటర్లను నియమించింది. పీసీసీ అధికార ప్రతినిధులు బోరెడ్డి అయోధ్య రెడ్డి, లింగం యాదవ్​సహా11 మందిని నియమిస్తూ సోమవారం పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​కుమార్​ గౌడ్​ ఆదేశాలిచ్చారు. 

వారితో పాటు పీసీసీ మీడియా కన్వీనర్​ మేదగోని కమలాకర్​, ఏఐపీసీ చాప్టర్​ ప్రెసిడెంట్​ ఇర్ఫాన్​ అజీజ్​, పీసీసీ ప్రచార కమిటీ మెంబర్​ జక్కని అనిత, శ్రీకాంత్​, సంతోష్​ రుద్ర, అనిల్​ కుమార్​ పులి, సామా సునీల్​ రెడ్డి, మహిపాల్​ రెడ్డి, విజయ్​ భాస్కర్,​ ఆనంద్​ బొలిశెట్టిలకు కో ఆర్డినేటర్లుగా బాధ్యతలను అప్పగించారు.

 ALSO READ :  మల్లారెడ్డి పాలనకు కాలం చెల్లింది : తోటకూర వజ్రేశ్ యాదవ్‌‌‌‌