మార్కెట్లోకి బాష్ కొత్త ప్రొడక్టులు

మార్కెట్లోకి బాష్  కొత్త ప్రొడక్టులు

హైదరాబాద్​, వెలుగు:  వృత్తి నిపుణులు, మేస్త్రీలు, గృహ వినియోగదారుల కోసం బాష్​ సరికొత్త చేతి పరికరాలను విడుదల చేసింది.  వీటిలో ప్లయర్లు, స్క్రూడ్రైవర్లు, రెంచిలు, సుత్తెలు, రంపాలు, కత్తులు వంటివి ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని కొత్త ఉత్పత్తులను తీసుకొస్తామని బాష్​తెలిపింది.  

ఇవన్నీ వీడీఈ సర్టిఫైడ్​టూల్స్​ అని, ఎక్కువ వోల్టీజీల వద్ద పనిచేసే ఎలక్ట్రీషియన్లకు, టెక్నీషియన్లకు ఎంతో ఉపయోగపడతాయని బాష్​  సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ఒకరు చెప్పారు. పవర్​ డిస్ట్రిబ్యూషన్​, ఎలక్ట్రిక్​మెయింటనెన్స్​, ఇన్​స్టలేషన్లకు ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు.