
హైదరాబాద్, వెలుగు: థాయిలాండ్ నుంచి సుమారు100 మంది బౌద్ధ భిక్షువులు అక్టోబర్ లో గుల్బర్గా మీదుగా నాగార్జునసాగర్ లోని బుద్ధవనానికి పాదయాత్రగా రానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని బేగంపేట టూరిజం ప్లాజాలో బాలీవుడ్ నటుడు, బుద్ధిజం ప్రచారకుడు గగన్ మాలిక్ మంత్రి జూపల్లి కృష్ణారావును సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
గగన్ మాలిక్ ను బుద్ధవనం ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య మంత్రి జూపల్లికి పరిచయం చేశారు. బుద్ధవనానికి ప్రపంచ దేశాల్లో ప్రాచుర్యం కల్పించడం, వివిధ బౌద్ధదేశాల ప్రతినిధులను బుద్ధవనానికి రప్పించడం, వారి సాంస్కృతిక కేంద్రాలను బుద్ధవనంలో ఏర్పాటు చేయడం వంటి తదితర అంశాలను చర్చించారు.