ఇన్‌స్టాగ్రామ్‌లో యువతిని వేధించిన యువకుడి అరెస్ట్‌

ఇన్‌స్టాగ్రామ్‌లో యువతిని వేధించిన యువకుడి అరెస్ట్‌

గుడిహత్నూర్, వెలుగు: ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్‌ ఐడీ క్రియేట్‌ చేసి ఓ అమ్మాయిని వేధింపులకు గురిచేసిన ఓ యువకుడిని అరెస్ట్ చేసినట్లు ఉట్నూర్‌ ఏఎస్పీ కాజల్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గుడిహత్నూర్‌ మండలంలోని లింగాపూర్​కు చెందిన గోపాల్‌ (20) ఓ యువతి పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్‌ ఐడీ క్రియేట్‌ చేశాడు. ఆ అకౌంట్​లో మండల కేంద్రానికి చెందిన ఓ అమ్మాయి గురించి అసత్య ప్రచారం చేశాడు. 

సదరు పోస్టులు చూసిన బాధిత యువతి షీటీమ్​కు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు టెక్నికల్‌ ఎవిడెన్స్​తో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. గోపాల్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ పేర్కొన్నారు.