ప్లాస్టిక్​ లేని సొసైటీ కోసం కన్యాకుమారి టు చెన్నై పరుగు

V6 Velugu Posted on Oct 08, 2021

కన్యాకుమారి టు చెన్నై.. దాదాపుగా 750 కిలోమీటర్లు. టార్గెట్​ పదిరోజులు.  ప్లాస్టిక్​ లేని సొసైటీని చూడాలి. రెండు లక్షల విత్తనాలు నాటాలన్న లక్ష్యం.  ఈ  ఆలోచనతోనే కన్యాకుమారి నుంచి చెన్నైకి పరుగు మొదలుపెట్టాడు తొమ్మిదేళ్ల షర్వేష్​​. తన వయసు పిల్లలంతా ఆటపాటలతో బిజీగా ఉంటే షర్వేష్​​ మాత్రం ప్లాస్టిక్ వాడకం తగ్గించడంపై జనాల్లో అవగాహన  పెంచడానికి రోడ్లపై పరుగులు తీస్తున్నాడు. దారి మధ్యలో ఖాళీ స్థలాల్లో రకరకాల పూలు, పండ్ల సీడ్​ బాల్స్​ నాటుతున్నాడు. షర్వేష్​కు ఇలాంటి ప్రయోగాలు కొత్తేం కాదు. చిన్నప్పట్నించీ రన్నర్​గా 146 మెడల్స్​ అందుకున్నాడు ఈ చిచ్చర పిడుగు​. అంతేకాదు ఐదేళ్ల వయసులోనే కిలోమీటర్ల మేర రివర్స్​ వాకింగ్​ చేసి ఇండియన్​ బుక్​ ఆఫ్​ రికార్డులకి ఎక్కాడు. ఇంతకుముందు 56 మారథాన్​లలోనూ పార్టిసిపేట్​ చేశాడు. వాటి ఇన్​స్పిరేషన్​తోనే ప్లాస్టిక్​ వాడకాన్ని తగ్గించాలనే నినాదంతో రీసెంట్​గా కన్యాకుమారి టు చెన్నై జర్నీ  మొదలుపెట్టాడు.  ఈ జర్నీని పదిరోజుల్లోనే కంప్లీట్​ చేస్తానని చెబుతున్నాడు కూడా. 

Tagged award, BOY, planting, running, seed balls,

Latest Videos

Subscribe Now

More News