బైకు చోరీ అలారానికి చిన్నోడి డ్యాన్స్​ షో

బైకు చోరీ అలారానికి చిన్నోడి డ్యాన్స్​ షో

బైకు చోరీ అలారంకు తగ్గట్టు 
చిన్నోడి డ్యాన్స్​ షో.. వీడియో వైరల్‌‌

చాలా దీన పరిస్థితుల్లో బతుకుతున్నా కొంతమంది పిల్లల్లో ట్యాలెంట్​కు మాత్రం కొదవుండదు. అలాంటిదే ఈ చిన్నోడి డ్యాన్స్​ షో. దార్లో పోతుంటే ఆ చిన్నోడికి సూపర్​బైక్​ కనిపించింది. దాన్ని జస్ట్​ అలా తన్నాడు. అంతే, అది చోరీ అలారంతో కూతపెట్టేసింది. ఇంకేముంది, ఆ అలారం మ్యూజిక్​కు తగ్గట్టు తన ఒంటిని ఒంపులు తిప్పేశాడు. ఎట్ల అంటే ఆ డ్యాన్స్​ చూస్తే ‘ఇరగదీసిండు’ అనేలా చేశాడు. అందుకేనేమో ఆనంద్​ మహీంద్ర ఆ చిన్నోడి డ్యాన్స్​ వీడియోను ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. ఎక్కడ జరిగిందో, ఎప్పుడు జరిగిందో తెలియదు గానీ, ఆ చిన్నారి డ్యాన్స్​ మాత్రం నెటిజన్లకు బాగానే వినోదాన్ని పంచింది. ఆస్కార్​ వచ్చేస్తదిలే అని కామెంట్లు పెట్టారు.