అయ్యో.. బిడ్డా..!గేట్ మీద పడి బాలుడు మృతి..మేడ్చల్ జిల్లా బౌరంపేటలో ఘటన

అయ్యో.. బిడ్డా..!గేట్ మీద పడి బాలుడు మృతి..మేడ్చల్ జిల్లా బౌరంపేటలో ఘటన
  • బిల్డర్​పై కేసు నమోదు

దుండిగల్, వెలుగు: మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. బౌరంపేటలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటి వద్ద గేటు మీద పడి బాలుడు మృతి చెందాడు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూరుకు చెందిన దంపాల నవీన్, మీన దంపతులు. బతుకుదెరువు కోసం మేడ్చల్ జిల్లా బౌరంపేటకు వలస వచ్చారు. వీరి కొడుకు ఆకాశ్‌‌‌‌‌‌‌‌ (7) స్థానికంగా ఓ ప్రైవేటు స్కూల్​లో ఫస్ట్​క్లాస్ చదువుతున్నాడు. బౌరంపేటలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి నవీన్ వాచ్​మెన్​గా పనిచేస్తుండగా, ఆకాశ్​గురువారం అక్కడికి వెళ్లాడు. ఇంటి గేటు వద్ద ఆడుకుంటుండగా, ప్రమాదవశాత్తు గేటు మీద పడింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గోడకు గేటును అమర్చకుండా, పక్కకు నిలబెట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. దీంతో ప్రమాదానికి కారణమైన బిల్డర్ పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.