పరిగిలో వీధి కుక్క దాడిలో బాలుడికి తీవ్రగాయాలు

పరిగిలో వీధి కుక్క దాడిలో బాలుడికి తీవ్రగాయాలు

పరిగి, వెలుగు: వీధి కుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలైన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పరిగి మున్సిపాలిటీలోని గాంధీ చౌక్ వద్ద షేక్ అంజద్ కుటుంబం ఉంటోంది.  మంగళవారం మధ్యాహ్నం అంజద్ కొడుకు షేక్ అనాస్ (4) బయట ఆడుకుంటుండగా వీధి కుక్క దాడి చేసింది. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడగా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.