మండలం చేయకపోతే ఎన్నికల బహిష్కరణ

మండలం చేయకపోతే ఎన్నికల బహిష్కరణ

జగదేవపూర్,  వెలుగు: తిగుల్ గ్రామాన్ని మండలంగా ప్రకటించకపోతే వచ్చే ఎన్నికలను బహిష్కరిస్తామని మండల సాధన సమితి సభ్యులు హెచ్చరించారు.  మండలం కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం 300 రోజులకు చేరడంతో నల్లబ్యాడ్జీలు ధరించి ఎడ్లబండ్లకు నల్లజెండాలు, నల్ల బెలూన్స్‌‌ కట్టి ర్యాలీ తీశారు.  అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద  నిరసన తెలిపారు. ఈ సందర్భంగా  సర్పంచ్ భాను ప్రకాష్ రావు.

పీఏసీఎస్‌‌ డైరెక్టర్ భూమయ్య మాట్లాడుతూ మండల వ్యవస్థ వచ్చినప్పటి నుంచి తిగుల్‌‌ను మండలం చేయాలని డిమాండ్ ఉందని గుర్తుచేశారు.  300 రోజులుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. నేతలు నరసింహారెడ్డి, జంగం ఐలయ్య, భిక్షపతి, వెంకటరెడ్డి,  ఉపసర్పంచ్ ఐలయ్య, శ్రీరామ్ రెడ్డి, సీతయ్య, ఆంజనేయులు, మల్లేశం, ఎల్లయ్య, రాజు, ఈశ్వర్, చంద్రారెడ్డి, బిక్షపతి, వెంకట్ పాల్గొన్నారు.