చీర కట్టుకుని కాలేజీకి వెళ్లిన యువకులు…

చీర కట్టుకుని కాలేజీకి వెళ్లిన యువకులు…

మహారాష్ట్ర: పూణెలోని ఫెర్గూసన్ కాలేజీకి చెందిన ముగ్గురు విద్యార్థులు ఆ కాలేజీ వార్షికోత్సవ వేడుకలో చీరలు కట్టుకున్నారు. లింగ సమానత్వం గురించి చెప్పడానికే తాము చీరలు కట్టుకున్నామని వారు చెప్పారు. ఫెర్గూసన్ కాలేజీలో ప్రతీ సంవత్సరం  ఏదో ఒక థీమ్ పై వార్షికోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సారి ‘టై అండ్ శారీ’ అనే థీమ్ ద్వారా ఫంక్షణ్ ను జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో… థర్డ్ ఇయర్ చదువుతున్న ఆకాశ్ పవార్, సుమిత్ హోన్వాడజ్కర్, రుషికేష్ సనాప్ లు మాత్రం చీరలు కట్టుకుని కాలేజీకి వెళ్లారు. మొదట వారిని చూసి నవ్వుకున్న తోటి స్టూడెంట్స్ ఆ తరువాత సెల్ఫీలు దిగారు. ఆ ముగ్గురిలో ఒకరైన ఆకాశ్ పవార్ స్పందిస్తూ.. ఆడవాళ్లు చీరలు, కుర్తాలు, మగవాళ్లు ప్యాంటు షర్ట్ మాత్రమే వేసుకోవాలని రూల్ ఏమీ లేదని అన్నారు.  అయితే లింగసమానత్వం చాటడానికే తాము ఈ పనిని చేశామని అన్నారు. చీర కట్టుకోవడం చాలా కష్టమైన పనని.. అందుకు తమ తోటి విద్యార్థినిలు సహాయం చేశారని చెప్పారు. లింగ వివక్ష లేకుండా అందరూ సమానమేనని తెలియజేసినందుకు కాలేజీ యాజమాన్యం తమను మెచ్చుకుందని చెప్పారు ఆకాశ్.