
హైదరాబాద్, వెలుగు: గోదావరి రివర్ మేనే జ్‌మెంట్ బోర్డు (జీఆర్‌ఎంబీ)కు కేంద్ర ప్రభుత్వం కొత్త చైర్మన్‌ను నియమించింది. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)లో సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ (ఎస్‌ఏజీ) స్థాయిలో ఉన్న బీపీ పాండేను హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ (హెచ్‌ఏజీ) పదవికి ప్రమోట్ చేసి, జీఆర్‌ఎంబీ చైర్మన్‌గా అపాయింట్ చేసింది. మంగళవారం కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత చైర్మన్ ఏకే ప్రధాన్.. ఈ నెల 31వ తేదీతో పదవీ విరమణ చేయనున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయన స్థానంలో బీపీ పాండేను నియమించారు. ఆయన నియామకం 2025 ఆగస్టు నుంచి అమలులోకి వస్తుందని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు జీఆర్‌ఎంబీ చైర్మన్‌గా కొనసాగుతారని కేంద్రం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇటీవల జీఆర్‌ఎంబీ మెంబర్ సెక్రటరీ అళగేశన్‌కు కేంద్రం డిమోషన్ ఇచ్చి కేవలం మెంబర్‌గా పరిమితం చేసింది. ఆయన స్థానంలో ఆర్‌కే కనోడియాను మెంబర్ సెక్రటరీగా నియమించింది. తాజాగా బీపీ పాండేను కొత్త చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.