6న అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ స్నాతకోత్సవాలు

6న అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ స్నాతకోత్సవాలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో 24వ స్నాతకోత్సవాలు ఈనెల 6వ తేదీన జరగనున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై తోపాటు కెనడాలోని వాంకోవర్ కామన్ వెల్త్ ఆఫ్ లర్నింగ్ సీఈవో ప్రొఫెసర్ ఆశ కన్వర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. స్నాతకోత్సవాల్లో భాగంగా 2019 నుంచి 2021 సంవత్సరం వరకు డిగ్రీ, పీజీ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులైన 94, 206 మందికి సర్టిఫికెట్లు ప్రధానం చేయనున్నారు. ఇందులో డిగ్రీలో 88 817 విద్యార్థులు పీజీ డిప్లమాలో 7369 విద్యార్థులు పత్రాలు అందుకోనున్నారు. డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన వారిలో 44,233 మంది మహిళలు ఉండగా 42,583 మంది పురుషులు ఉన్నారు. 

ఇక బంగారు మెడల్స్ 128 మంది సాధించగా అందులో డిగ్రీలో 43 మంది పీజీలో 85 మంది ఈ పతకాలను సాధించారు. మెడల్స్ ను సాధించిన వారిలోనూ 87 మంది మహిళలు 41 మంది పురుషులు ఉన్నారు. ఈ మూడేళ్లలో 20082 మంది ఖైదీలు ఇక్కడ డిగ్రీని పూర్తి చేయగా అందులో ముగ్గురు ఖైదీలు బుక్ ప్రైస్ అవార్డులను గెలుచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్ కు సంబంధించిన స్టడీ మెటీరియల్ ను ప్రతి ఒక్క విద్యార్థికి అందించేందుకు ప్రత్యేక మెటీరియల్ ను రూపొందిస్తున్నారు. ఈ మెటీరియల్ ను ఆగస్టు 26న విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అందుబాటులోకి తీసుకువస్తామని విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ సీతారామారావు స్పష్టం చేశారు. ఈ సారి విశ్వవిద్యాలయం తరఫునుంచి ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్న ప్రొఫెసర్ ఆశ కన్వర్ కు గౌరవ డాక్టరేట్ ను అందిస్తున్నామన్నారు.