
బ్రహ్మాజీ లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘కథకళి’. ప్రసన్న కుమార్ నాని దర్శకత్వంలో రవికిరణ్ కలిదిండి నిర్మిస్తున్నారు. ‘కమిటీ కుర్రాళ్లు’ ఫేమ్ యశ్వంత్ పెండ్యాల, మధు దామరాజు, మైమ్ మధు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శనివారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. నిహారిక కొణిదెల క్లాప్ కొట్టగా, హర్షిత్ రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు.
గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులకు సస్పెన్స్, ఎమోషన్స్‌తో రోలర్‌కోస్టర్ రైడ్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించేలా ఈ చిత్రం ఉంటుందని మేకర్స్ చెప్పారు. ఈ సందర్భంగా బ్రహ్మాజీ మాట్లాడుతూ ‘ఈ కథ నాకు చాలా నచ్చింది. ఇందులో కథే హీరో’ అని చెప్పాడు. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు దర్శక నిర్మాతలు చెప్పారు. పవన్ సంగీతం అందిస్తున్నాడు.