భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు ప్రారంభం

భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు ప్రారంభం

వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి తిరుకల్యాణ మహోత్సవాలకుశనివారం తెర లేచింది. ఈనెల 20వ తేదీ వరకుస్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి నిత్య కల్యాణాలు రద్దు చేశారు. ఉదయం గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి మూల, అలంకార, కల్యాణ మూర్తులకు విశేష తిరుమంజనం చేశారు. శనివారం సందర్భంగా స్వామికి సువర్ణ తులసీ దళాలతోఅర్చన చేశారు. అనంతరం స్వామికి ఉగాది పచ్చడిని నివేదించారు. సాయంత్రం స్వామికి దర్బారు సేవ చేశాక బేడా మండపంలో పంచాంగ శ్రవణం వైభవోపేతంగా జరిగింది. ముందుగా శ్రీసీతారామచంద్రుల ఆదాయ, వ్యయాలు, రాజ్యపూజ్యాలు ఆస్థాన పురోహితులు చెన్నావఝుల వేంకటేశ్వర అవధాని వివరించారు. రామయ్యకు ఆదాయం, వ్యయం సమానంగా 5 ఉందన్నారు. రాజపూజ్యం5, అవమానం 2 ఉందని పేర్కొన్నారు. సీతమ్మవారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం4, అవమానం 5గా పేర్కొన్నారు.

వికారినామ సంవత్సరంలో వర్షాలు తక్కువగా కురుస్తాయని, పంటలు ఖరీఫ్‍కంటే రబీలోనే మంచి గా పండుతాయని వివరించారు. పాడిపంటలు ఒక మాదిరిగానే ఉంటాయని, పరిపాలనకు సంబంధించికొన్ని అవరోధాలు ఉన్నాయని, చాలా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆధ్యాత్మిక చింతన పెంచుకుని, క్షేత్ర దర్శనాలు తరచూ చేయాలనిపేర్కొన్నారు. కాగా రాష్ట్ర గవర్నర్‍ కెఎల్ నర్సింహన్‍ను బ్రహ్మో త్సవాలకు దేవస్థానం ఈవో తాళ్లూ రిరమేష్ బాబు ఆహ్వానించారు. ఆలయ అర్చకులు గవర్నర్‍ దంపతులకు ఆశీర్వచనం ఇచ్చి, శేషవస్త్రాలు, శేషమాలికలు, ప్రసాదం అందజేశారు. తాను ఎప్పటిలాగే శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి హాజరు అవుతానని గవర్నర్‍ అర్చకులకు తెలిపారు.