ఘనంగా వరదరాజు స్వామి బ్రహ్మోత్సవాలు

ఘనంగా వరదరాజు స్వామి బ్రహ్మోత్సవాలు
  •     స్వామివారి రథోత్సవంలో పాల్గొన్న నీలం మధు 

ములుగు, వెలుగు: వరదరాజుస్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం వరదరాజుపూర్ గ్రామంలోని వరదరాజుస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. స్వామివారి రథోత్సవంలో నీలం మధు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. వరదరాజుస్వామి ఆలయం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. కార్యక్రమంలో తూముకుంట నర్సారెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ప్రతాపరెడ్డి, క్షమిత వరదరాజు స్వామి, ఆలయ చైర్మన్ గోపాలకృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.