బ్రెజిల్ లో భీకర తుఫాన్.. నగరాలు మునిగిపోయాయి

బ్రెజిల్ లో భీకర తుఫాన్.. నగరాలు మునిగిపోయాయి

బ్రెజిల్ ని హరికేన్(తుపాన్) చిగురుటాకులా వణికించింది. తుపాన్​ ధాటికి ఎంతో మంది నిరాశ్రయులు కాగా.. వరదల కారణంగా పదుల సంఖ్యలో మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రెజిల్​దక్షిణ భాగంలోని అనేక నగరాల్లో వరదల ప్రభావంతో 21 మంది మృతి చెందారు.  

ALSO READ : భారత ప్రధానమంత్రి మోదీ.. ఇప్పుడు ఈ పేరు కూడా మారిపోయింది

వరద నీరు తగ్గుతుండటంతో మృతదేహాలు బయటపడుతున్నాయి. దేశంలోని 60 నగరాలపై హరికేన్ ప్రభావం పడిందని గవర్నర్​ ఎడ్వర్డో లైట్​ తెలిపారు. 

గతంలోనూ ప్రకృతి విపత్తులు..

వాతావరణ మార్పుల కారణంగా హరికేన్ లు తరచూ ఏర్పడతాయని ఆ శాఖ అధికారులు తెలిపారు. ఇదే ఏడాది వచ్చిన ఇంకో తుపాన్​ కారణంగా 13 మంది మృతి చెందారు. వందల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. ఫిబ్రవరిలో భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడి సావోపాలోలో 65 మంది మృతి చెందారు.