Millet Break fast : సజ్జలతో కట్లెట్.. హెల్తీఫుడ్.. లొట్టలేస్తూ లాగిస్తారు..

Millet Break fast :  సజ్జలతో కట్లెట్.. హెల్తీఫుడ్..  లొట్టలేస్తూ లాగిస్తారు..

రుచికరంగా ఉంటూనే ఆరోగ్యాన్నిచ్చే వాటిలో మిల్లెట్స్​ టాప్​ ప్లేస్​లో ఉంటాయి.  బ్రేక్​ ఫాస్ట్​ తినేందుకు పిల్లలు మారాం చేస్తారు.  మిల్లెట్స్​ అంటే చాలు ఆవడ దూరం పరిగెత్తుతారు. కాని సజ్జలతో తయారు చేసిన  కట్​ లెట్​ ను లొట్టలేసుకుంటే లాగించేస్తారు.  మరి పిల్లలకు ఇష్టమైన సజ్జల కట్​ లెట్​ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..!

కట్​ లెట్​తయారీకి కావాల్సినవి 

  • సజ్జలు: ఒకటిన్నర కప్పు
  •  శనగపిండి: అర కప్పు
  • వాము: అర టీస్పూన్
  •  పచ్చి బటానీలు: రెండు కప్పులు
  •  జీలకర్ర, కారం, కసూరీ మేథి: ఒక్కో టీస్పూన్
  •  ఉల్లిగడ్డ తరుగు: ఒక కప్పు
  • పచ్చిమిర్చి: రెండు
  • జీలకర్ర పొడి, చాట్ మసాలా: ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున
  • గరం మసాలా: పావు టీస్పూన్
  • ఉప్పు, నూనె: సరిపడా
  • కొత్తిమీర: కొంచెం
  • నిమ్మరసం: ఒక టేబుల్ స్పూన్

తయారీ విధానం : పచ్చిబటానీలను కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. పాన్​లో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, ఉల్లిగడ్డ తరుగు, పచ్చిమిర్చి వేసి వేగించాలి. తర్వాత పచ్చిబటానీ పేస్ట్, జీలకర్ర పొడి, చాట్ మసాలా, గరం మసాలా, ఉప్పు, కొత్తిమీర, నిమ్మరసం వేసి కలపాలి. ఆపై ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టాలి. 

ఒక గిన్నెలో సజ్జ పిండి, శనగ పిండి, వాము, ఉప్పు, కారం, కసూరీ మేథి వేసి కలపాలి. అందులో కొంచెం నీళ్లు పోసి ముద్దగా చేయాలి. ఆ తర్వాత చిన్న ఉండలుగా చేసి, అరచేతిలో గారెలా వత్తి లోపల స్టఫింగ్​ పెట్టి మళ్లీ ఉండ చేయాలి. అలా చేసిన వాటిని కాస్త అదిమి, ఇడ్లీ ప్లేట్‌లో పేర్చి, దాన్ని ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించాలి. 

పావుగంట తర్వాత తీయాలి. అందుకోసం పాన్​లో నూనె వేసి వేడి చేసి జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్,  ఉప్పు వేసి కలపాలి. అందులో ఉడికించిన సజ్జ కట్​లెట్​లను పెట్టి రెండు వైపులా కాల్చాలి. అంతే.. వేడి వేడి కట్​లెట్​ రెడీ. 

–వెలుగు, లైఫ్​–