లాక్ డౌన్ రూల్స్ బ్రేక్

లాక్ డౌన్ రూల్స్ బ్రేక్

బుధ,గురు వారాల్లో భారీగా రోడ్డెక్కిన జనం
రెడ్ జోన్లలో కనిపించని వెహికల్ చెకింగ్
గ్రీన్ జోన్లకు ట్రావెల్ చెక్ పోస్టులతో చెక్ పెట్టేందుకు పోలీసుల ప్లాన్
పాసులతో ట్రావెల్ చేస్తున్నవారిపైనా నిఘా

హైదరాబాద్, వెలుగు: లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ అవుతున్నాయి. ఫస్ట్, సెకండ్ ఫేజ్ లాక్ డౌన్ తో పోలిస్తే థర్ ఫేజ్ డ్ లో సెక్యూరిటీని పోలీసులు లైట్ తీసుకుంటున్నారు. దీంతో బుధ, గురువారాల్లో రెడ్ జోన్స్ సహా రాష్ట్రవ్యాప్తంగా జనంపెద్ద ఎత్తున రోడ్డెక్కారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత రెండు రోజుల్లో లాక్ డౌన్ రూల్స్ ఎక్కడా కనిపించలేదు. రెడ్ జోన్లయిన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని చెక్ పోస్టుల వద్ద వెహికల్ చెకింగ్ నామమాత్రంగానే జరిగింది. దీంతో నిత్యావసరాలు, హెల్త్ ఎమర్జెన్సీ పేరుతో బయటకు వచ్చే వారితోపాటు వైన్స్, కన్ స్ట్రక్షన్, కారణాలతో జనం తిరుగుతున్నారు.

చెక్ పోస్టులు ఏర్పాటు చేసి…

రెడ్ జోన్ల నుంచి విచ్చలవిడిగా వాహనాల రాకపోకలు సాగుతుండడంతో ఉన్నతాధికారులు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల బోర్డ‌ర్ చెక్ పోస్టుల వద్ద బుధ, గురువారాల్లోట్రావెల్ చేసిన వెహికల్స్ డేటాను సేకరించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. గ్రేటర్ లో కరోనా పూర్తిగా కంట్రోల్ కాకపోవడంతో ఇలాంటి ప్రయాణాల వల్లగ్రీన్ జోన్లకు వైరస్ వ్యాప్తిచెందే ప్రమాదం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని సుమారు 12 చెక్ పోస్ట్ సిబ్బందిని అలర్ట్ చేశారు. ఎమర్జెన్సీ సర్వీసులు మినహా ఇతర అవసరాల కోసం పాసులు తీసుకుని ప్రయాణిస్తున్న వారిని పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో అత్యవసరాల కోసం తీసుకున్న పాసులతో చాలామంది జిల్లాలు దాటుతున్నారని గుర్తించారు. ఇలాంటి పాసులతో రెడ్ జోన్స్ నుంచి గ్రీన్ జోన్లకు ట్రావెల్ చేయడం వల్ల కరోనాను క్యారిచేసేఅవకాశాలు ఉన్నాయని స్థానిక పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.