Good Health: బ్రేక్ ఫాస్ట్ ఎన్నిగంటలకు ... లంచ్.. డిన్నర్ ఎంత తినాలి..

Good Health:  బ్రేక్ ఫాస్ట్ ఎన్నిగంటలకు ... లంచ్.. డిన్నర్ ఎంత తినాలి..

హెల్దీగా ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ మిస్ చేయొద్దని డాక్టర్లు చెప్తూనే ఉంటారు. బ్రేక్ ఫాస్ట్ రాజులా చేయాలి, లంచ్ ప్రిన్స్ లా తినాలి, డిన్నర్ బిచ్చగాడిలా తినాలనే మాట కూడా ఇప్పుడు పాపులర్ అయింది. అదే నిజం కూడా! రాత్రంతా కడుపు ఖాళీగా ఉంటుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఫాస్టింగ్ ని బ్రేక్ చేస్తాం. పొద్దున మహారాజులా కడుపు నిండాతినాలి. చాలామంది లేట్ గా బ్రేక్ ఫాస్ట్ చేస్తుంటారు. 

కానీ, ఎనిమిదిగంటలలోపు బ్రేక్ ఫాస్ట్ చేసినప్పుడే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఎనిమిది గంటల తర్వాత తిన్న దాంట్లో చాలా వరకు శరీరానికి ఉపయోగపడకుండా... కొవ్వుగా మారుతుంది. ఎనిమిది గంటల లోపు తింటేనే... మెటబాలిజం రేటు పెరుగుతుందని. గుర్తుంచుకోవాలి. 

మధ్యాహ్నం ఉదయం కంటే తక్కువ, రాత్రి ఇంకా తక్కువ తినాలి. ఈ రూల్స్ ఫాలో అయినప్పుడు ఒబెసిటీ, డయాబెటిస్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ దగ్గరికి రావని ఇప్పటికే ఎన్నో స్టడీల్లో తేలింది. బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల మెటబాలిజంలో మార్పులు వచ్చి ఆరోగ్యం చెడిపోతుంది.బరువు కూడా పెరుగుతారు.  బ్రేక్ ఫాస్ట్ చేయని వాళ్ల రక్త వాళాల్లో కొవ్వు చేరి మూసుకు పోతున్నట్టు మరో స్టడీలో తేలింది. ఇక బ్రేక్ ఫాస్ట్ లో తాజా పండ్లు, కూరగాయలుంటే ఇంకా మంచిది

-వెలుగు,లైఫ్​-