గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంట

గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంట
  • ఏడేళ్ల గరిష్టానికి చేరుకున్న బ్రెంట్ క్రూడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేటు
  • పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీజిల్ రేట్లు పైకి!

బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా క్రూడాయిల్ రేట్లు ఏడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. పొలిటికల్ టెన్షన్లు, డిమాండ్ పెరగడం, సప్లయ్ తక్కువగా ఉండడం వంటి కారణాలతో  బెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రూడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యారెల్ రేటు  శుక్రవారం 93.44 డాలర్లను తాకింది. ఇంకా  ఆయిల్ ధరలు ఇప్పటిలో తగ్గేటట్టు కనిపించడం లేదు. కరోనా నుంచి గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎకానమీలు రికవరీ అవుతున్నాయి. దీంతో ఆయిల్ డిమాండ్ వేగంగా పెరుగుతోంది. కానీ, ఇంతే వేగంగా సప్లయ్ పెరగడం లేదు. ఆయిల్ మార్కెట్ బుల్లిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉందని,  రేట్లు ఇంకా పెరగొచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు. 
క్రూడాయిల్ రేట్లు పెరగడానికి కారణాలివే..
1.జియో పొలిటికల్ టెన్షన్లు..
కిందటేడాది డిసెంబర్  1 న, బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ రేటు 71.32  డాలర్ల వద్ద ట్రేడయ్యింది.  ప్రస్తుతం ఈ రేటు 93.44 డాలర్లుగా ఉంది. కేవలం రెండు నెలల్లోనే 22 డాలర్లు పెరిగింది. జియో పొలిటికల్ టెన్షన్లతో క్రూడాయిల్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. కిందటి నెల 20 న  యూఏఈ ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెసిలిటీపై యెమెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైతి రెబల్స్  డ్రోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాడులు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి క్రూడాయిల్ రేట్లు  వెనక్కి తిరిగి చూడడం లేదు.  ఆ తర్వాత ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–రష్యా గొడవ ఆయిల్ రేట్లకు ఆజ్యం పోసింది. రష్యా అతి పెద్ద ఆయిల్ సప్లయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రష్యా తమ సైన్యాన్ని మోహరించడం పెద్ద వివాదంగా మారింది. ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆక్రమించుకుంటే చూస్తూ ఊరుకోమని  యూఎస్ ప్రకటించడంతో ఈ జియో పొలిటికల్ గొడవ మరింత ముదిరింది. జియో పొలిటికల్ టెన్షన్లతో క్రూడాయిల్ సప్లయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రభావం పడుతోంది. 
2.పెరుగుతున్న డిమాండ్..
గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎకానమీ కరోనా సంక్షోభం నుంచి కోలుకుంటోంది.  దీంతో ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డిమాండ్ పెరుగుతోంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం, గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఆయిల్ డిమాండ్ కరోనా ముందు స్థాయిలకు చేరుకుంది. కానీ, సప్లయ్ మాత్రం తక్కువగా ఉంది. రోజుకి మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ తక్కువగా  సప్లయ్ అవుతోందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఎజెన్సీ ప్రకటించింది.
3.సప్లయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సమస్యలు..
మరోవైపు పేలుళ్ల వలన ఇరాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–టర్కీ మధ్య ఆయిల్ పైప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సమస్య తలెత్తింది. ఆయిల్ రేట్లు పెరగడానికి ఇదొక కారణం. ఇరాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఈక్విడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లిబియా దేశాలలో ఆయిల్ పైప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్లకు మెకానికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమస్యలు తలెత్తడంతో సప్లయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అంతరాయం ఏర్పడుతోంది. పొలిటికల్ టెన్షన్ల వలన కజకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సప్లయ్ సమస్యలు తలెత్తడం, యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  చలికాలం వలన, బ్రెజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  కరోనా వలన  ప్రొడక్షన్ తగ్గడంతో గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా క్రూడాయిల్ రేట్లు పెరుగుతున్నాయి. 
ఇండియాలో పరిస్థితేంటి..
త్వరలో పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేట్లు పెరుగుతాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..
గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఆయిల్ రేట్లు ఒక డాలర్ పెరిగితే,  దేశంలో లీటర్ పెట్రోల్, డీజిల్ రేటు 50 పైసలు పెంచాల్సి ఉంటుంది.  కిందటేడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ రేటు 71 డాలర్ల వద్ద ట్రేడవ్వగా, ప్రస్తుతం ఈ రేటు 93.44 డాలర్లకు పెరిగింది. కానీ, దేశంలో పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీజిల్ రేట్లలో మాత్రం మార్పు లేదు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండడంతో పెట్రోల్, డీజిల్ రేట్లను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచడం లేదు. ఈ ఎలక్షన్స్ పూర్తయితే  రేట్లు పెంపుదల ఉంటుందని అంచనా. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తగ్గిస్తే పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీజిల్ రేట్లను కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంచొచ్చు. 
2 నెలలుగా రేట్లు పెరగలే!
ఐఓసీ వంటి కంపెనీలు ఈ నెల 3 నాటికి బ్యారెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  89.12 డాలర్లు వెచ్చించి కొనుగోలు చేస్తున్నాయని లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభలో పెట్రోలియం మినిస్టర్ హరదీప్ పురి అన్నారు. డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1, 2021 ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బ్యారెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్రోల్ రేటు 79.55 డాలర్ల దగ్గర, డీజిల్ రేటు 78.48 డాలర్లగా ట్రేడయ్యిందని చెప్పారు. ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ముంబైలో లీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్రోల్ రేటు రూ. 109.98 గా, డీజిల్ రేటు రూ. 94.14 గా ఉంది. కిందటి నెల 27 నాటికి గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా లీటర్ పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేటు బ్యారెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 101.44 డాలర్ల వద్ద, డీజిల్ 102.70 వద్ద ట్రేడయ్యింది. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముంబైలో పెట్రోల్, డీజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేట్లలో మార్పు లేకపోవడం గమనించాలి. దేశంలో పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీజిల్ రేట్లు గ్లోబల్ క్రూడాయిల్ రేట్లతో లింక్ అయి ఉంటాయి. దీంతో త్వరలో దేశంలోనూ రేట్లు పెరుగుతాయని అంచనావేయొచ్చు.
 

ప్రొడక్షన్ తగ్గించిన ఒపెక్ దేశాలు
ఆయిల్ రేట్లను పెంచేందుకు పెట్రోలియం ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టింగ్ దేశాలు (ఒపెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) తమ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కావాలనే పెంచడం లేదు. కిందటి నెలలో ఒపెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశాలు రోజుకి 7 లక్షల బ్యారెళ్ల ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తక్కువగా ప్రొడ్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాయి. ఆయిల్ ప్రొడక్షన్ పెంచుతామని చెప్పినా, ఈ దేశాలు తమ టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చేరుకోవడం లేదు.  కావాలనే ఒపెక్ దేశాలు ఆయిల్ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెంచడం లేదని ఎనలిస్టులు చెబుతున్నారు. ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరిగ్గా లేకపోవడంతో నైజీరియా, అంగోలాలో ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగ్గింది. పొలిటికల్ టెన్షన్లతో రష్యాలో ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తగ్గించేశారు.