ఆదిలాబాద్ జిల్లాలో లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు హౌజింగ్ ఏఈ. ఇందిరమ్మ ఇల్లు ఫోటోలు అప్ లోడ్ చేసేందుకు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. మంగళవారం (జనవరి 27) జిల్లాల్ఓని నార్నూర్ లో తనిఖీలు నిర్వహంచిన ఏసీబీ అధికారులు హౌజింగ్ ఏఈ శ్రీకాంత్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఏసీబీ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ఇందిరమ్మ ఇల్లు ఫోటోలు అప్ లోడ్ చేయడానికి ఒక వ్యక్తి నుంచి 20 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు ఏఈ. చివరికి పదివేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. అధికారులు చెప్పినట్లుగా పదివేలు ఇచ్చాడు.
ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారు నుంచి ఏఈ పదివేల రూపాయలు తీసుకుంటుండగా రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. ఏఈని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ సందర్భంగా లంచం తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు.
