
పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. కాని ఓ పెళ్లి 15 వేల ఫైన్ అన్నారు యూపీ పోలీసులు. నవవధువు పెళ్లి మండపానికి కారు బానెట్ పై కూర్చొని పెళ్లి మండపానికి వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రిస్క్ చేసి ఫొటోలు
ప్రస్తుత రోజుల్లో వధూవరులు వివాహ ఆల్బమ్‌లకు పోజులివ్వడానికి సిగ్గుపడటం లేదు. ఫోటోలేమిటి.. డ్యాన్స్ లు ఏమిటి రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక అలాంటి వీడియోలో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతున్నాయో చెప్పనక్కరలేదు. సోషల్ మీడియా అంటే నేటి యువతకు మహా పిచ్చి.. ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ప్రస్తుతం వారంతా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం పెళ్లి విషయంలో మాత్రం యువత తమకు నచ్చిన విధంగా రకరకాలుగా కొత్త పద్ధతుల్లో చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. హడావుడి ఎక్కువగా ఉంటుంది. ఫొటోషూట్ అయితే చెప్పనక్కర్లేదు. ఫొటోషూట్ కోసం ఎక్కడికెక్కడికో వెళ్లి.. రిస్కు చేసైనా సరే రకరకాల పద్ధతుల్లో ఫొటోలు దిగుతున్నారు.
భిన్నంగా చేయాలనుకుంది.. ఫైన్ కట్టింది
తాజాగా ఓ యువతి పెళ్లికి ముందు ఫొటో షూట్‌ను అందరిలా కాకుండా భిన్నంగా చేయాలని ప్రయత్నించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కారణం చూపి వధువుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి మండపానికి వెళ్లే సమయంలో కారు బానెట్‌పై వధువు కూర్చింది. కారు ఆపిన ఉత్తరప్రదేశ్ పోలీసులు.. 15వేల రూపాయిలు జరిమానా విధించారు. అయితే ఇప్పుడు ఈ ఫైన్ వధువు తరపు వారు కట్టాలా.. వరుడు తరుపు వారు కట్టాలా అనే విషయంపై తర్జన భర్జన పడుతున్నారు.
వీడియో వైరల్
ఓ వధువు తన పెళ్లి రోజున కారు బానెట్‌పై ఎక్కి ఇన్‌స్టాగ్రామ్ రీల్ తీయాలని అనుకుంది. పెళ్లికి వచ్చే సమయంలో బానెట్ పై ఎక్కి మండపానికి బయల్దేరింది. మధ్యలో పోలీసులు ఎంట్రీ అయ్యారు. ఇలా వెళ్లడం తప్పు అని చెప్పారు. చెప్పడమే కాక.. ఫైన్ కూడా వేశారు.ఉత్తరప్రదేశ్‌లో కదులుతున్న కారు బానెట్‌పై వధువు ఎక్కి కూర్చుంది. అందమైన ఎరుపు రంగు లెహంగా ధరించిన వధువు సంప్రదాయంగా ఉంది. కొందరు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటే, మరికొందరు ఇది నిర్లక్ష్య సాహసంగా అభివర్ణిస్తున్నారు. వధువు చర్యల పట్ల ఉత్తరప్రదేశ్ పోలీసులు మండిపడ్డారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు వధువుకు రూ.15,500పైగా జరిమానా విధించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడిన వీడియో చాలామంది దృష్టిని ఆకర్షించింది. వైరల్ కంటెంట్‌ని రూపొందించే సాకుతో, చౌదరి తన పసుపు-రంగు లెహంగాను బానెట్‌పై ఉంచింది. డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు, ఆమె కెమెరా వైపు ఉల్లాసంగా చూస్తుండగా ఆసక్తిగల రైడర్లు ఆమె వైపు చూస్తారు.
వీడియో కామెంట్స్ విభాగంలో నెటిజన్లు రక రకాల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు వధువు చర్యను విమర్శించారు. కొంతమంది ఎక్కువ జరిమానాలు లేదా కఠినమైన జరిమానాలు విధించాలని కోరారు. రీల్ అనేక లైక్, కామెంట్‌లతోపాటు వేలాది వీక్షణను పొందింది. “లడ్కీ రీల్ నహీ బనా రి థే.. లడ్కీ పార్లర్ కా ప్రమోషన్ చెల్లించింది.” సదరు వధువు రీల్ కాదు.. లేడీ పార్లర్ ప్రమోషన్ చేస్తుందని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. “ఆజ్ కల్ సింపుల్ వెడ్డింగ్ కా ట్రెండ్ హే కటం హోగ్యా హై,” అని మరొక వినియోగదారు ఎత్తి చూపారు. మరో వ్యక్తి మాత్రం “అద్భుతంగా ఉన్నారు, కీర్తి కోసం జరిమానా మరింత ఎక్కువగా కట్టాలి.” అని చమత్కరించారు. ఆమె కారు బానెట్ పై కూర్చొని ఎలా ఊరేగుతూ వచ్చిందో ఓ లుక్కేయండి. .
https://twitter.com/AshTheWiz/status/1660611331534524420