ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

కామారెడ్డి , వెలుగు: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ  ఆశ వర్కర్లు శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. మెయిన్​గేటు ధర్నా చేశారు. అనంతరం రోడ్డుపై వంటా వార్పు చేసి నిరసన తెలిపారు.  కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్​చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని,  పెండింగ్​లో ఉన్న బిల్స్​ చెల్లించాలని, పీఎఫ్​ సౌకర్యం కల్పించాలని   నినాదాలు చేశారు. అనంతరం డీఎంహెచ్​వో లక్ష్మణ్​సింగ్​కు వినతి పత్రం అందజేశారు.  

గౌడ జన హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ ఎన్నిక


నిజామాబాద్ టౌన్/ కోటగిరి, వెలుగు: గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ జిల్లా కమిటీని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్​    ఆధ్వర్యంలో  ఎన్నుకున్నారు.  శుక్రవారం నిజామాబాద్ ప్రెస్​క్లబ్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కొత్త కమిటీని ప్రకటించారు. మోకు దెబ్బ జిల్లా అధ్యక్షుడిగా కోటగిరి అరుణ్ గౌడ్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చేపూరి జిన్నా గౌడ్, గడ్డమీది శివలింగం గౌడ్, ప్రధాన కార్యదర్శులుగా మెరుగు శ్రీనివాస్ గౌడ్, బోనాల శివలింగం గౌడ్, 32 మంది సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అరుణ్ గౌడ్ మాట్లాడుతూ జిల్లాలోని పలు వీడీసీలు గౌడ కులస్తులను ఇబ్బందులకు గురి చేస్తూ, గ్రామ బహిష్కరణ చేస్తున్నారని తెలిపారు. వీడీసీలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామన్నారు.గీత పనివారల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా విఠల్ తెలంగాణ రాష్ట్ర గీత పనివారల సంఘం 
రాష్ట్ర  కార్యదర్శిగా ఎన్నికైన కోటగిరికి చెందిన విఠల్​గౌడ్​ను  మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని చెప్పారు.  

కార్యకర్తలకు అండగా ఉంటాం


కోటగిరి, వెలుగు: ప్రతి కార్యకర్తకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని బీజేపీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్​చార్జి మాల్యాద్రి రెడ్డి అన్నారు. కోటగిరి మండలం సుంకిని, రాంగంగా నగర్, కొల్లూర్, సోంపూర్, టాక్లి, దోమలేడ్గి, వల్లభాపూర్ గ్రామాల్లో కార్యకర్తల కుటుంబాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. కొన్ని గ్రామాల్లో ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్లి  మాట్లాడారు.  డబుల్ బెడ్రూం ఇండ్లు రాని పేదలను కలిశారు. 
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్యాయాన్ని ఎదిరించడంలో ప్రతి  కార్యకర్త ముందుండాలని పిలుపునిచ్చారు. టీఆర్‌‌ఎస్ పాలనలో నిరుపేదలకు అన్యాయం జరిగిందన్నారు. పొలాలు, ఇండ్లు ఉన్నోళ్లకే    అధికార పార్టీ లీడర్లు ‘డబుల్’ ఇండ్లు ఇచ్చుకున్నారని ఆరోపించారు. స్పీకర్ ప్రతి మీటింగ్‌లో ‘డబుల్’ ఇండ్లు 
పేదలకే ఇవ్వాలని ఆఫీసర్లకు సూచించినా ఫలితం లేకుండా పోతోందన్నారు. బీజేపీ  మండల అధ్యక్షుడు గాండ్ల  శ్రీనివాస్, బాన్సువాడ కన్వీనర్ భాస్కర్, బాబీ, సతీశ్, గురునాథ్ తదితరులు పాల్గొన్నారు. 

 

భిక్కనూరుకు చేరిన ‘సమైక్యతా పరుగు’


భిక్కనూరు, వెలుగు: కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు జరుగుతున్న ‘జాతీయ సమైక్యతా పరుగు’  ​శుక్రవారం భిక్కనూరు టోల్​ప్లాజాకు చేరుకుంది.   టీమ్​కు ఉమ్మడి నిజామాబాద్​ ఎన్​సీసీ కమాండింగ్​ఆఫీసర్​
ఆర్ పీ. రాజేందర్, కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్​రెడ్డిలతో పాటు గురుకుల స్కూల్​, భిక్కనూరు గవర్నమెంట్ ​బాయ్స్​ స్కూల్​ ఎన్​సీసీ స్టూడెంట్లు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్​సీసీ ఆఫీసర్, ఎస్పీ మాట్లాడుతూ ‘సమైక్యతా పరుగు’   స్టూడెంట్లల్లో ఆత్మ విశ్వాసం, ఐక్యమత్యం, సమైక్యతా భావాన్ని పెంపొందిస్తోందన్నారు. సీఐ యాలాద్రి,  తహసీల్దార్​నర్సింలు, ఎస్సై నవీన్​గౌడ్, గురుకుల ప్రిన్సిపాల్​ నరసింహారెడ్డి, హైస్కూల్​ హెడ్​మాస్టర్​ శ్రీనాథ్ తదితరులు 
పాల్గొన్నారు. 

 

అగ్రికల్చర్​ ఆఫీసర్ల సలహాలతో అధిక దిగుబడులు


భిక్కనూరు, వెలుగు:  ప్రతి రైతు అధిక దిగుబడు లు సాధించాలంటే అగ్రికల్చర్​ఆఫీసర్ల సలహా లు, సూచనలు పాటించాలని స్టేట్​సీడ్స్​మేనేజ్​మెంట్​రీజినల్​మేనేజర్ విష్ణువర్ధన్​రెడ్డి చెప్పారు. శుక్రవారం భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామ రైతు వేదికలో ఏఈవో రజిత అధ్యక్షతన జరిగిన అవగాహన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరి రైతులు అధిక దిగుబడి సాధించాలంటే నాటుకు ముందు పొలంలో జనుము, జీలుగ విత్తనాలు వేయాలని సూచించారు.  మార్కెట్​కమిటీ చైర్మన్​ భగవంత రెడ్డి, డీఏవో భాగ్య లక్ష్మి, ఏడీఏ అపర్ణ, డీసీసీబీ డైరెక్టర్​ గాండ్ల సిద్ధ రాములు, ఎంపీపీ గాల్​రెడ్డి, సర్పంచ్​నర్సింలు యాదవ్, ఎంపీటీసీ యశోద, రైతుబంధు మండల కన్వీనర్​ రాంచంద్రం తదితరులు పాల్గొన్నారు.

 

తాగిన మత్తులో తొక్కి చంపేశాడు..

నందిపేట, వెలుగు: మండలంలోని తల్వేద గ్రామంలో తాగిన మత్తులో ఓ వ్యక్తి మరో వ్యక్తిని తొక్కి చంపాడు. ఎస్సై శ్రీకాంత్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మండ్ల కొండయ్య (42) మేస్త్రి పని చేసుకుంటూ జీవించేవాడు.   గురువారం రాత్రి కొండయ్య గ్రామంలోని గీతామందిరం వద్ద కూర్చున్నాడు.  ఇదే సమయంలో తాగిన మత్తులో ఫోన్​మాట్లాడుకుంటూ అటుగా వచ్చిన బట్టు నరేశ్ తో , కొండయ్య తన గురించే  ఫోన్​లో మాట్లాడుతున్నావని  గొడవకు దిగాడు. దీంతో నరేశ్​ కొండయ్యను కొట్టి బలంగా నెట్టేశాడు. కిందపడిపోవడంతో మెడపై కాలితో  తొక్కాడు. దీంతో మెడ, తల వెనకభాగంలో తీవ్ర గాయమయ్యింది. గమనించిన స్థానికులు కొండయ్యను చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు. మృతుడి తమ్ముడు మాండ్ల మల్లికార్జున్​ ఇచ్చిన కంప్లైంట్​మేరకు కేసు ఫైల్​చేసి  దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.