
- ప్రభుత్వాన్ని కోరిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: పనుల కోసం మిడిల్ – ఈస్ట్ దేశాలకు వెళ్లి ఇరుక్కుపోయిన మన వర్కర్లను తిరిగి మన దేశానికి తీసుకురావాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని కోరారు. దేశం కాని దేశంలో వాళ్లంతా తిండి లేక ఇబ్బందులు పడుతున్నారని వారి గురించి ఆలోచించాలని అన్నారు. ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి వారిని ఇక్కడకు తీసుకురావాలని సూచించారు. “ కరోనా కారణంగా మిడిల్ ఈస్ట్‌లో చాలా బిజినెస్‌లు నిలిచిపోయాయి. దీంతో మన దేశానికి చెందిన వర్కర్లు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లంతా చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. మన అక్క చెల్లెళ్లు, అన్నదమ్ములను ప్రత్యేక ఫ్లైట్లు ఏర్పాటు చేసి ఇక్కడకు తీసుకు వచ్చి వాళ్లకు సాయం చేద్దాం. కావాలంటే వారిని క్వారంటైన్‌లో ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవచ్చు” అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.