
శుభాకాంక్షలు తెలిపే వారికి మంత్రి సత్యవతి రాథోడ్ సూచన
హైదరాబాద్, వెలుగు: తనకు శుభాకాంక్షలు తెలపడానికి బొకేలతో రాకుండా విద్యార్థులకు ఉపయోగపడేలా పుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాగ్స్, పెన్నులు, పెన్సిళ్లు, దోమ తెరలు, దుప్పట్లు తీసుకురావాలని గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. రాష్ట్ర మినీ అంగన్‌వాడీ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం మంత్రిని ఆమె నివాసంలో కలిశారు. మినీ అంగన్‌వాడీలకు కూడా ఆయాలను ఇవ్వాలని, మరిన్ని వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడారు. అంగన్‌వాడీల సమస్య లపై స్టడీ చేసి, త్వరలోనే పరిష్కరిం చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మన అంగన్వాడీలను దేశంలోనే ఉన్నత స్థానంలో నిలిపేలా పనిచేయాలన్నారు.