అదానీ ఎంటర్ప్రైజెస్ బాండ్ ఇష్యూ సక్సెస్

అదానీ ఎంటర్ప్రైజెస్ బాండ్ ఇష్యూ సక్సెస్

న్యూఢిల్లీ:  అదానీ ఎంటర్​ప్రైజెస్ లిమిటెడ్ రూ.వెయ్యి కోట్ల బాండ్ ఇష్యూ బుధవారం ప్రారంభమైన మూడు గంటలలోపే పూర్తిగా సబ్​స్క్రయిబ్​ అయింది. కంపెనీ నాన్–-కన్వర్టిబుల్ డిబెంచర్ (ఎన్​సీడీలు) ఇష్యూ బుధవారం (జులై 09) ప్రారంభమైంది.  

ఇది ఈనెల 22న ముగియాల్సి ఉంది.  పూర్తిగా సబ్​స్క్రయిబ్ అయినందుకు ముందస్తుగా ముగిసే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు తెలిపాయి.  వీటికి ఏటా 9.3 శాతం వరకు వడ్డీ చెల్లిస్తారు. మొదటి రోజే ఇష్యూకు రూ. 1,400 కోట్లకు పైగా బిడ్లు వచ్చాయి. 

ఈ ఆఫర్ ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన జరిగింది  రిటైల్ పెట్టుబడిదారులు, సంపన్నులు,  కార్పొరేట్ల నుంచి బలమైన రెస్పాన్స్​ వచ్చింది.