
న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన గ్రాన్యూల్స్ ఇండియా అమెరికాలో 33,024 బాటిల్స్ మెటోప్రోలోల్ సక్సినేట్ ఎక్స్‌టెండెడ్ -రిలీజ్ టాబ్లెట్స్ (100, 500 కౌంట్ బాటిల్స్)ను రీకాల్ చేస్తోంది. ప్రొడక్షన్‌లో సమస్యే కారణమని యూఎస్ ఎఫ్‌డీఏ తెలిపింది.
ఆరు నెలల స్టెబిలిటీ స్టడీస్‌లో డిజల్యూషన్ టెస్ట్‌లో ఫెయిలవ్వడమే కారణమని వెల్లడించింది. జూన్ 24 నుంచి క్లాస్-2 రీకాల్ ప్రారంభమైంది. దీనిని తాత్కాలిక ఆరోగ్య సమస్యలకు లేదా తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు ఉన్నప్పుడు క్లాస్ 2 రీకాల్ ఇష్యూ చేస్తారు. గ్రాన్యూల్స్ ఇండియా షేర్లు బుధవారం రూ.479.10 వద్ద ముగిశాయి.