పెద్ద కోర్పోల్ లో కరెంటు తీగలు తెగిపడి 18 గొర్లు మృతి..

పెద్ద కోర్పోల్ లో కరెంటు తీగలు తెగిపడి 18 గొర్లు మృతి..
  • వరంగల్​ జిల్లా పెద్ద కోర్పోల్ లో ప్రమాదం

నెక్కొండ, వెలుగు: విద్యుత్ తీగలు తెగిపడి గొర్లు చనిపోయిన ఘటన వరంగల్​జిల్లాలో జరిగింది.  నెక్కొండ మండలం పెద్దకోర్పోల్ గ్రామానికి చెందిన నూకల లక్ష్మి గొర్రెలను పెంచుతుంది. 11 కేవీ లైన్ వెళ్తుండగా తీగల ఇన్సురేటర్​ఫెయిల్​కావడంతో బుధవారం తెగి షెడ్డుపై పడ్డాయి. దీంతో కరెంట్ షాక్ తో 18 గొర్లు చనిపోగా, మరో 20 గొర్లు అస్వస్థతకు గురయ్యాయి. దీంతో రూ.6లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితురాలు లక్ష్మి ఆవేదనతో చెప్పింది. 

ఇండ్లపై నుంచి విద్యుత్ తీగలు వెళ్తుండగా.. గతంలో సమస్యపై గ్రామస్తులు పలుమార్లు సంబంధిత ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకోకపోవడంతో ప్రమాదం జరిగింది. తీగలను తొలగించి ఉంటే ప్రమాదం జరిగేది కాదని, అధికారుల నిర్లక్ష్యమే కారణమని బాధితురాలు పేర్కొంది.  లక్ష్మి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి పరికి మధుకర్​ కోరారు.