ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ ఎన్విడియా.. 4 లక్షల కోట్ల డాలర్లను దాటిన మార్కెట్ వాల్యూ

ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ ఎన్విడియా.. 4 లక్షల కోట్ల డాలర్లను దాటిన మార్కెట్ వాల్యూ

న్యూఢిల్లీ: ఏఐ చిప్‌‌‌‌ల తయారీ కంపెనీ ఎన్విడియా విలువ  కేవలం 25 ఏళ్లలోనే 500 కోట్ల డాలర్ల నుంచి 4 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది.  కంపెనీ షేర్లు బుధవారం (జులై 09) 2.5శాతం పెరిగి 164 డాలర్లను దాటాయి.  2023 ప్రారంభంలో ఇవి 14 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి.

 ఏఐ రివల్యూషన్‌‌‌‌తో ఎన్విడియా ఎక్కువగా లాభపడింది. ఈ కంపెనీ మార్కెట్‌‌‌‌ క్యాప్ టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్, ఆల్ఫాబెట్‌‌‌‌ (గూగుల్‌‌‌‌) ను అధిగమించింది.  దీని మార్కెట్ విలువ రెండేళ్ల క్రితం 60 వేల కోట్ల డాలర్ల కంటే తక్కువగా ఉండగా, ఇప్పుడు ఎస్‌‌‌‌ అండ్ పీ  500 ఇండెక్స్‌‌‌‌లో కీలకంగా మారింది. 

ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో, చైనా ఎగుమతి ఆంక్షల మధ్య 18.8 బిలియన్ డాలర్ల లాభాన్ని సాధించింది. కంపెనీ ఆదాయం  69 శాతం వృద్ధి చెంది 44.1 బిలియన్ డాలర్లకు ఎగిసింది.