యూరియా వాడకం తగ్గించుకోండి.. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి జేపీ నడ్డా సూచన

యూరియా వాడకం తగ్గించుకోండి.. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి జేపీ నడ్డా సూచన
  • ఎరువుల కొరత లేకుండా రాష్ట్రానికి సహకరిస్తం
  • సేంద్రియ సాగు ప్రోత్సాహానికి సహకారం అందిస్తం
  • యూరియా దారిమళ్లకుండా చూడాలని వ్యాఖ్య
  • రాష్ట్రానికి సరిపడా ఎరువులు సరఫరా చేయాలని అధికారులకు ఆదేశాలు

గోదావరిఖని, వెలుగు: రామగుండం ఫెర్టిలైజర్స్ అం డ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్) ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో ఉత్పత్తి అవుతున్న యూరియాను ముందుగా తెలంగాణ రాష్ట్రానికే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. తెలం గాణకు యూరియా కేటాయింపులు తగ్గించడం అన్యాయమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎంపీ వంశీకృష్ణ కేంద్ర వ్యవసాయం శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌‌‌‌‌‌‌‌కు బుధవారం లేఖ రాశారు. తెలంగాణకు అవసరమైన యూరియా మొత్తాన్ని కేటాయించకుండా, రాజకీయాలు చేస్తూ ఇతర రాష్ట్రాలకు మళ్లించడం అన్యాయమని మండిపడ్డారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కోత విధిస్తూ, బీజేపీ పాలిత రాష్ట్రాలకు యూరియా సప్లయ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఖరీఫ్ సీజన్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణకు 10.4 లక్షల టన్నుల యూరియా అవసరమని, 2024లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు 1.3 లక్షల టన్నుల యూరియాను కేటాయించగా, 2025లో ఇదే కాలానికి 71,773 టన్నుల యూరియా మాత్రమే అలాట్‌‌‌‌‌‌‌‌ చేశారని గుర్తుచే శారు. గతేడాదితో పోలిస్తే 45 శాతం తగ్గించారన్నారు. అలాగే, ప్రతి నెల తెలంగాణకు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్ నుంచి 60 వేల టన్నుల యూరియా ఇవ్వాల్సి ఉండగా, ఈ నెలలో 30 వేల టన్నులు మాత్రమే కేటాయించి, ఇందులో ఇప్పటివరకు 10 వేల టన్నులు మాత్రమే సప్లయ్‌‌‌‌‌‌‌‌ చేశారని, ఇది అన్యాయమని పేర్కొన్నారు. 

రైతుల జీవితాలతో కేంద్రం ఆటలు.. 
తెలంగాణకు యూరియా కేటాయింపులు తగ్గించి, రైతుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుకుంటున్నదని ఎంపీ వంశీకృష్ణ మండిపడ్డారు. పెద్దపల్లి లోక్‌‌‌‌‌‌‌‌సభ పరిధిలోని రామగుండం ప్లాంట్‌‌‌‌‌‌‌‌కు ఏటా 12.7 లక్షల టన్నుల యూరియాను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని, కానీ ఇందులో తెలంగాణకు తక్కు వగా కేటాయిస్తున్నారని, ఇది సరైంది కాదన్నారు. 2023 మేలో 1.17 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి చేయగా, కేవలం 44,701 టన్నులే రాష్ట్రానికి సప్లయ్‌‌‌‌‌‌‌‌ చేశారని, మిగతా యూరియాను ఉత్తరప్రదేశ్ లాంటి బీజేపీపాలిత రాష్ట్రాలకు సరఫరా చేశారన్నారు. 

ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం అలాగే వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణకు గతేడాదిలాగే ఇప్పుడు కూడా యూరియా కేటాయింపులు చేసి, సప్లయ్‌‌‌‌‌‌‌‌ చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. అలాగే, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌లో ఉత్పత్తిచేసిన యూరియాను మొదట తెలంగాణకు సరఫరా చేశాక మిగిలిన రాష్ట్రాలకు పంపించాలన్నారు. రామగుండం నుంచి యూరి యాను తెలంగాణకు అందిస్తున్నా.. కేటాయింపుల్లో మాత్రం ఈ ప్రాంత రైతులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని పేర్కొన్నారు. వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రికి లేఖలో విజ్ఞప్తి చేశారు.

ప్రతిపక్షం ఒత్తిడితోనే ఈఎల్‌‌‌‌‌‌‌‌ఐ స్కీమ్
కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయ్‌‌‌‌‌‌‌‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ఈఎల్ఐ)స్కీమ్‌‌‌‌‌‌‌‌ను తీసుకురావడం సంతోషంగా ఉందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. అన్ని రంగాల్లో ప్రధానంగా తయారీ రంగంలో ఉపాధి కల్పన, ఉపాధి సామర్థ్యం, సామాజిక భద్రతను పెంపొందించడానికి ఈ స్కీమ్ తీసుకొచ్చారని పేర్కొన్నారు. ప్రతిపక్షాల ఒత్తిడి వల్లే ఈ స్కీమ్ తీసుకొచ్చారని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.