ఆధ్యాత్మికం: కష్టాలను చూసి పారిపోకండి.. ప్రేమతో వాటిని దూరంగా విసిరేయండి..!

ఆధ్యాత్మికం:  కష్టాలను చూసి పారిపోకండి.. ప్రేమతో వాటిని దూరంగా విసిరేయండి..!

 జీవితంలోక కష్ట పరిస్థితులు ఎదురైనప్పు డు.. వాటికి ఎలా రెస్సాండ్ అవాలి? అనే దానికి రెండు దారులు ఉన్నాయి. ఒకటి, మనం భయంతో పారిపోవచ్చు. లేదా ప్రేమతో వాటిని అధిగమించడానికి ప్రయ త్నించవచ్చు. ఒకవేళ మనం మొదటిదాన్ని ఎంచుకుంటే మన బలం అంతా ఆవిరవుతుంది. 

ఎండుటాకులు గాలికి ఎగిరినట్టు ఎక్కడో ఎగిరిపడతాం..  తన నీడ నుంచి తాను తప్పిం చుకుని పారిపోవడానికి ప్రయత్నించేవాడు అలసిపోయి.. చివరికి కూలిపోతాడు. ఈ నీడ అనే భయం.. ప్రేమ తాలూకు వెలుగు ప్రసరిం చినప్పుడే మాయమైపోతుంది. ప్రేమే మన బలం. ప్రేమ మన ఆశ్రయం. భయంకరమైన పరిస్థితులు మన బలాన్ని ఆవిరి కానివ్వకూడదు. ఏటికి ఎదురీదినట్టుగా.. కష్టాలను ఎదురీదడానికి మరింత బలాన్ని సాధించుకోవాలి. ఈ సందర్భానికి తగ్గట్టుగా ఎదగడానికి, సరైన రీతిలో రెస్పాండ్ కావాలి.

కష్టాలను తట్టుకుని, నిలబడి ఎదుర్కోవడానికే ఈ మనిషి జన్మ లభించింది. కానీ, వాటిని చూసి పారిపోవడానికి కాదు. సముద్రంలో ఓడ ప్రయాణిస్తున్నప్పుడు మధ్యలో తుఫానులు రావచ్చు. భారీ అలలు ముంచెత్తవ చ్చు. సొరచేపలు కూడా అడ్డుపడొచ్చు.అదేగనుక రేవులో లంగరు వేసిన ఓడకు అలాంటి సమస్యలు, సవాళ్లు ఏమీ ఉండవు.. ఏదేమైనా, ఒక ఓడను కేవలం ఓడరేవులో ఉంచడానికి ఎవరు తయారుచేస్తారు? జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు.. మనలో ఉండే అనంతమైన శక్తిని రగిలించాలి. 

నిస్వార్థం, ప్రేమ తాలూకు సువాసనలను వ్యాప్తి చేయాలి. దుఃఖంలో మునిగిపోయి ఉన్న వాళ్లకు చేయి అందించగలగాలి. జీవితం ఎప్పుడూ మనకు మంచి అనుభవాలను కలిగించకపోవచ్చు. నిజానికి, మంచి కంటే మనకు చెడు అనుభవాలే ఎక్కువ ఉండొచ్చు. అది ప్రపంచ స్వభావం. ఏదేమైనా, ఇటువంటి సవాళ్లను, అనుభవాలను విజయం వైపు మళ్లించే మెట్లుగా మార్చడం నేర్చుకోవాలి. డిజాస్టర్స్ జరిగినప్పుడు, దానికి ఎవరినో ఒకరిని లేదా ప్రకృతిని నిందించడంలో అర్థం లేదు. మనం మూల కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి.