Deepika Padukone: ‘కల్కి 2’ నుంచి దీపికా పదుకునే ఔట్‌.. ఆమెకు బదులు ఎవరెంటే?

Deepika Padukone: ‘కల్కి 2’ నుంచి దీపికా పదుకునే ఔట్‌.. ఆమెకు బదులు ఎవరెంటే?

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన కల్కి 2898AD నుంచి దీపికా పదుకునే ఔట్ అయింది. ఈ మూవీ (కల్కి 2) సీక్వెల్లో దీపికా పదుకునే నటించడం లేదని స్పష్టం చేస్తూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బాగా అలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర నిర్మాత అశ్వినీదత్ (వైజయంతి ప్రొడక్షన్ హౌస్) X వేదికగా తెలిపారు.

‘‘ అన్ని మార్గాల్లో జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మేం ఈ నిర్ణయం తీసుకున్నాం. ‘కల్కి’ సీక్వెల్‌లో దీపికా పదుకొనే భాగం కాదని అధికారికంగా తెలియజేస్తున్నాం. ఫస్ట్ పార్ట్ కల్కిలో ఆమెతో సుదీర్ఘ ప్రయాణం చేసినప్పటికీ, రెండో పార్ట్‌లో (Kalki 2) భాగస్వామి కాలేకపోయింది. గొప్ప టీమ్‌తో, అంతకుమించిన కమిట్‌మెంట్తో కల్కి సీక్వెల్‌ మీ ముందుకు వస్తుంది. భవిష్యత్తులో దీపిక మంచి సినిమాలతో అలరించాలని కోరుకుంటున్నాం’’ అని వైజయంతీ మూవీస్‌ పోస్ట్‌ ద్వారా వెల్లడించింది.

ALSO READ : రియల్ స్టార్ ఉపేంద్ర బర్త్డే స్పెషల్..

అయితే, కల్కి సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూసే క్రమంలో, మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల.. టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇటీవలే దీపికా పదుకునే పెట్టిన అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీజనబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కండిషన్సే.. ఇప్పుడు కల్కి2 ప్రాజెక్ట్ ఎలిమేషన్కి కారణమని సినీ వర్గావర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇకపోతే.. సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ నుంచి దీపికా అవుట్ అయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే! 

ఏదేమైనా ప్రభాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జంటగా దీపికను చూద్దామనుకున్న అభిమానులకు నిరాశే కలిగింది. ఇక ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్లో నటిస్తుంది. అలాగే, షారుఖ్ ‘కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’తో పాటు సంజయ్ లీలా భన్సాలి ‘లవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ చిత్రాల్లో నటిస్తోంది.

దీపికా బదులు ఎవరెంటే?

కల్కిలో సుమతి పాత్రలో దీపికా నటించింది. ఇపుడు ఆ క్యారెక్టర్లో కీర్తి సురేష్‌ను లేదా సూపర్ వుమెన్ లోకాతో భారీ హిట్ కొట్టిన కల్యాణి ప్రియదర్శన్‌ ను తీసుకోవాలని నెటిజన్లు ట్వీట్స్ పెడుతున్నారు. అలాగే, మృణాల్ ఠాకూర్‌ను తీసుకున్న బాగుంటుందని నాగ్ అశ్విన్ను ట్యాగ్ చేస్తూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

దీపికా పదుకునే స్పిరిట్ కండీషన్స్ ఇవే:

  • రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే వర్కింగ్ టైమ్
  • అందులో రెండు గంటలు ప్రయాణానికి పోగా మరో ఆరు గంటలు సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటానని చెప్పిందట.
  • రూ.20 కోట్లు ఆమె రెమ్యునరేషన్ కాగా, వందరోజుల్లో తన పార్ట్ షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తవ్వకపోతే, ఆ తర్వాత షూట్ జరిగే ప్రతి రోజుకు అదనంగా రెమ్యునరేషన్ చెల్లించాలనేది మరో కండీషన్.
  • అలాగే తెలుగులో డైలాగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పనని కూడా కండిషన్ పెట్టిందట.

ఇన్ని రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం జరిగే వ్యవహారం కాదని భావించిన సందీప్ రెడ్డి.. ఆమెతో కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రద్దు చేసుకుని మరో హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ని సెలెక్ట్ చేసినట్లు వార్తలు వినిపించాయి.ఈ విషయంపై అధికారికంగా సందీప్ గానీ, దీపికా గానీ స్పందించలేదు.