
హీరో రామ్ అప్ కమింగ్ రిలీజ్ మూవీ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు పి దర్శకుడు. రామ్‌కు జంటగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ నవంబర్ 28న రిలీజ్ కానుంది.
ఇవాళ (సెప్టెంబర్ 18న) హీరో ఉపేంద్ర బర్త్డే స్పెషల్గా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఉపేంద్ర ఇందులో ఆంధ్రాకింగ్ సూపర్ స్టార్ సూర్యకుమార్‌గా (‘ఆంధ్ర రాజు) నటిస్తున్నారు. ఆయన పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉండబోతోందని మేకర్స్ తెలిపారు.
‘‘రియల్ స్టార్ ఉపేంద్రకి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘ఆంధ్ర రాజు’సూర్య పాత్రను, ఆయన పోషించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ఒక పండుగలా ఉంటుంది. ఆంధ్రా కింగ్ తాలూకా నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతుంది’’ అని మేకర్స్ ట్వీట్ చేశారు.
Team #AndhraKingTaluka wishes Real Star @nimmaupendra Garu a very Happy Birthday ❤🔥
— Mythri Movie Makers (@MythriOfficial) September 18, 2025
His portrayal of 'Andhra King' Surya will be loved and celebrated 💥💥#AndhraKingTaluka in cinemas worldwide on November 28th 🤩#AKTonNOV28
Energetic Star @ramsayz #BhagyashriBorse… pic.twitter.com/r1Qx6qFs5k
ఇకపోతే.. రామ్ బర్త్ డే సందర్భంగా మూవీ టైటిల్ గ్లింప్స్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో కన్నడ స్టార్ ఉపేంద్రను సినిమా హీరోగా చూపించారు. ఆయనకు అభిమానిగా రామ్ నటిస్తున్నట్లుగా ఉంది. అలాగే, ఇటీవల రెండు సాంగ్స్ రిలీజ్ చేయగా ఆడియన్స్ను బాగా ఆకట్టుకున్నాయి. ఇందులో రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సిద్ధార్థ నూని డీవోపీగా వర్క్ చేస్తుండగా వివేక్–మర్విన్ సంగీతం అందిస్తున్నారు.