
బాల్కొండ, వెలుగు: శ్రీరాంసాగర్ ప్రాజెక్టును బుధవారం బీసీ, ఎస్సీ, ఎస్టీ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ సందర్శించారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తూ మార్గమధ్యంలో ప్రాజెక్టు గెస్ట్ హౌస్‌కు చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ మండలాధ్యక్షుడు స్వాగతం పలికారు.
అనంతరం ప్రాజెక్టు అందాలను తిలకించి, ప్రాజెక్టుకు వచ్చే వరద పరిస్థితులు, నీటి నిల్వ సామర్థ్యం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టింటి ముత్యం రెడ్డి, కాంగ్రెస్బాల్కొండ అధ్యక్షుడు గున్నాల వెంకటేశ్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ సావెల్ గంగాధర్, ఇమ్రాన్, ప్రవీణ్, శ్రీనివాస్, సంజీవ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.