హైదరాబాద్ మెహిదీపట్నంలో మంగర్ బస్తీలో మామా అల్లుడు కొట్టుకుపోయిన ఘటన గురించి తెలిసిందే. సెప్టెంబర్ 14, ఆదివారం నాడు కొట్టుకుపోయిన వ్యక్తులకు సంబంధించిన ఆచూకీ దొరికింది. కొట్టుకుపోయిన వ్యక్తుల్లో అల్లుడు అర్జున్ డెడ్ బాడీ లభ్యం అయ్యింది. నల్గొండ జిల్లాలోని సంగెం గ్రామ సమీపంలో బాడీ దొరికింది.
వరదల్లో గల్లంతైన అర్జున్ డెడ్ బాడీ 60 కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయి భువనగిరి జిల్లాలో వలిగొండ మండలం సంగెం గ్రామ సమీపంలో మూసీ నది లోలెవల్ బ్రిడ్జిపై లభ్యమయ్యింది. బాడీని రికవర్ చేసుకున్న పోలీసులు.. పోస్టు మార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
మామా అల్లుడు వరదల్లో గల్లంతవ్వడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతో ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
