స్కూల్కు వెళ్లి వస్తుండగా ఉప్పొంగిన వాగు.. రాత్రంతా బడిలోనే నలుగురు టీచర్లు

స్కూల్కు వెళ్లి వస్తుండగా ఉప్పొంగిన వాగు.. రాత్రంతా బడిలోనే నలుగురు టీచర్లు

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులూ వంకలూ ఉప్పొంగుతున్నాయి. దీంతో ప్రజలకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కుమ్రంబీమ్ జిల్లాలో వాగు ఉప్పొంగడంతో నలుగురు టీచర్లు బుధవారం (సెప్టెంబర్ 17) రాత్రంతా బడిలోనే ఉండిపోయారు.  

జిల్లాలోని వాడిగోందిలో ఉవాగు ఉప్పొంగి ఉధృతంగా ప్రవాహిస్తుండటంతో టీచర్లు వాగును దాటలేకపోయారు. దీంతో రాత్రంతా బడిలో  ఉండిపోయారు నలుగురు ఉపాధ్యాయులు. పాధ్యాయులు అసిఫాబాద్ వెళ్లాల్సి ఉండగా.. వాగు ఉధృతికి రాత్రంతా బడిలోనే ఉండిపోయారు. 

మిర్చీ పనులకు వెళ్లి గోదావరి పాయలో చిక్కుకున్న 20 మంది కూలీలు:

ఉత్తర తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు వాగులు, నదులు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్నాయి. దీంతో రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ములుగు జిల్లాలో మిర్చీ పనులకు వెళ్లిన రైతులు గోదావరి పాయలో చిక్కుకోవడం భయాందోళనకు గురిచేసింది.

ములుగు జిల్లా  వెంకటాపురం మండలంలోని గోదావరి పాయలో కూలీల ట్రాక్టర్ చిక్కుకుంది. మిర్చీ పనుల కోసం బుధవారం (సెప్టెంబర్ 17) ఉదయం వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా గోదావరి ఉప్పొంగడంతో ట్రాక్టర్ తో సహా 20 మంది కూలీలు గోదావరిలో చిక్కుకున్నారు.  వెంటనే రైతులను జేసీబీ సహాయంతో కూలీలను దాటించారు అధికారులు. ప్రమాదం తప్పిన.