ఫ్రాన్స్ జాలరికి చిక్కిన 30కిలోల గోల్డ్ ఫిష్

 ఫ్రాన్స్ జాలరికి చిక్కిన 30కిలోల గోల్డ్ ఫిష్

మామూలుగా అక్వేరియంలో ఉండే గోల్డ్ ఫిష్ అత్యంత చిన్న పరిమాణంలో, తక్కువ బరువుతో ఉండడం చూసే ఉంటాం. కానీ 30 కిలోల బరువున్న గోల్డ్ ఫిష్ ను ఎప్పుడైనా చూశారా.. కనీసం అంత పెద్ద పరిమాణంలో ఉన్న చేప ఉంటుందని తెలుసా... ఇప్పటిదాకా వినని వాళ్లకు సాక్ష్యం ఇప్పుడు బయట పడింది. ఫ్రాన్స్ లోని ఓ చేపల జాలరికి 30 కిలోల గోల్డ్ ఫిష్ చిక్కింది. దీంతో ఆ వ్యక్తి అంతులేని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అంతే కాదు 2019లో యూఎస్ లోని మిన్నెసోటాలో జాసన్ పుగేట్ కు చిక్కిన (13కేజీ) గోల్డ్ ఫిష్ కంటే ఎక్కువ బరువుండడంతో దీన్ని చూడడానికి అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు.

షాంపైన్ లోని బ్లూ వాటర్ సరస్సుల వద్ద చేపలు పడుతున్న ఆండీ హ్యాకెట్ కు క్యారెట్ (గోల్డ్ ఫిష్ నిక్ నేమ్) చిక్కింది. అది అక్కడ ఉందని తనకు తెలుసని, కానీ దాన్ని పట్టుకుంటానని ఎప్పుడూ అనుకోలేదని హ్యాకెట్ చెప్పారు. అయితే దాన్ని పట్టుకోవడానికి హ్యాకెట్ కు దాదాపు 25నిమిషాలు పట్టిందట. అది తన వలలో పడినపుడు చాలా పెద్ద చేపే తన వలలో పడినట్టు భావించానని హ్యాకెట్ అనుకున్నారట. అది నీటిలో పైకి, కిందికి తేలియాడడంతో నారింజ రంగులో ఉన్న ఆ చేపను తాను గుర్తు పట్టానని జాలరి తెలిపారు. అది తన వలలో చిక్కడం తన అద్భుతమే కాదు, తన అదృష్టం కూడా అని సంతోషం వ్యక్తం చేశారు. నారింజ రంగులో ఉన్న ఈ గోల్డ్ ఫిష్ ను హ్యాకెట్ చేతిలో పట్టుకున్న ఫొటోలను బ్లూ వాటర్ లేక్స్ తన ఫేస్ బుక్ పేజీలో షేర్ చేయడంతో ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.