BRO Motion poster: ఆ బీజీఎం ఏందీ తమనన్నా.. ట్రెండ్ సెట్ చేస్తున్న బ్రో

BRO Motion poster: ఆ బీజీఎం ఏందీ తమనన్నా.. ట్రెండ్ సెట్ చేస్తున్న బ్రో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "బ్రో" మూవీ మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. విడుదలైన కొన్ని క్షణాల్లోనే రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది. పవన్ దేవుడిగా కనిపించనున్న ఈ మూవీని తమిళ దర్శకుడు, నటుడు సముద్రకనీ తెరకెక్కిస్తున్నాడు. ఇక మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.

ఇక తాజా విడుదలైన ఈ మోషన్ పోస్టర్ కు ఆడియన్స్ నుండి నెక్స్ట్ లెవల్ రెస్పాన్స్ వస్తోంది. ఈ ఒక్క అప్డేట్ తో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి. ఇక తమన్ అందించిన బీజీఎం అయితే గూస్బంప్స్ అనే చెప్పాలి. ఆయన ఇచ్చిన మ్యూజిక్ కు  పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవల్ అసలు. విడువులైన నలభై నిమిషాల్లోనే మిళియన్ వ్యూస్ రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.

మరి విడుదలకు ముందే కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఈ మూవీ.. ముందు ముందు ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో తేలియాలంటే జులై 28 వరకు ఆగాల్సిందే.