తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండ చరియలు

తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండ చరియలు

తిరుపతి: తిరుమల ఘాట్ రోడ్డులో నిన్న రాత్రి కొండ చరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షం కురుస్తున్న సమయంలో కొండ చరియలు విరిగిపడినట్లు తెలుస్తోంది. అయితే ఆ సమయంలో ఎలాంటి వాహనాల రాకపోకలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మొదటి ఘాట్ రోడ్డులోని 54 నెంబర్ మలుపు వద్ద కొండ చరియలు విరిగిపడడంతో కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. వర్షం తగ్గాక పోలీసులు బండరాళ్లను తొలగించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్లే కొండ అంచులు బాగా తడిసి.. అంచున ఆనుకుని ఉన్న కొండ రాళ్లు విరిగిపడినట్లు గుర్తించారు. రోడ్డుపై పడిపోయిన బండరాళ్లను  అధికారులు జేసీబీలను తీసుకొచ్చి తొలగించారు. వర్షాలు కురుస్తున్న సమయంలో ఘాట్ రోడ్డులో జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచించారు.