పెళ్లిళ్లపై చేస్తున్న ఖర్చు చదువుపై కంటే డబుల్‌‌‌‌‌‌‌‌

పెళ్లిళ్లపై చేస్తున్న ఖర్చు చదువుపై కంటే డబుల్‌‌‌‌‌‌‌‌
  • రూ.10 లక్షల కోట్లకు వెడ్డింగ్ ఇండస్ట్రీ

న్యూఢిల్లీ: ఇండియాలో వెడ్డింగ్ ఇండస్ట్రీ  సైజ్ రూ.10 లక్షల కోట్ల (130 బిలియన్ డాలర్ల) కు పెరిగిందని బ్రోకరేజ్ కంపెనీ జెఫరీస్‌‌‌‌‌‌‌‌ ఓ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. ఫుడ్‌‌‌‌‌‌‌‌, గ్రోసరీల తర్వాత పెళ్లిళ్ల కోసమే ఇండియన్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని తెలిపింది.   సగటు ఇండియన్ చదుపుపై చేసే ఖర్చు కంటే రెండింతలు ఎక్కువ  పెళ్లిపై చేస్తున్నాడని‌‌‌‌‌‌‌‌ వివరించింది. ‘ఇండియాలో ఏడాదికి సగటున 80 లక్షల నుంచి కోటి పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అదే చైనాలో ఏడాదికి 70–80 లక్షల పెళ్లిళ్లు, యూఎస్‌‌‌‌‌‌‌‌లో 20 లక్షల నుంచి 25 లక్షల పెళ్లిళ్లు జరుగుతున్నాయి.  

ఇండియా వెడ్డింగ్‌‌‌‌‌‌‌‌ ఇండస్ట్రీ సైజ్‌‌‌‌‌‌‌‌ యూఎస్‌‌‌‌‌‌‌‌ వెడ్డింగ్ ఇండస్ట్రీస్ (70 బిలియన్ డాలర్ల) కంటే  రెండింతలు ఎక్కువ. కానీ, చైనా వెడ్డింగ్ ఇండస్ట్రీ (170 బిలియన్ డాలర్ల) కంటే తక్కువ’ అని జెఫరీస్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ పేర్కొంది. ప్రజలు ఎక్కువగా ఖర్చు  చేస్తున్న ఇండస్ట్రీలలో  వెడ్డింగ్‌‌‌‌‌‌‌‌ రెండో అతిపెద్దదని తెలిపింది. రిటైల్‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైజ్‌‌‌‌‌‌‌‌ 681 బిలియన్ డాలర్లుగా ఉంది.  జ్యువెలరీ, క్లాత్స్‌‌‌‌‌‌‌‌ సెక్టార్లలో పెళ్లిళ్ల కారణంగా వినియోగం పెరుగుతోంది. ఇన్‌‌‌‌‌‌‌‌డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా ఆటో, ఎలక్ట్రానిక్స్‌‌‌‌‌‌‌‌ సెక్టార్లూ ప్రయోజనం పొందుతున్నాయి. ఒక పెళ్లి కోసం సగటున రూ.12.45 లక్షలు ఖర్చు చేస్తున్నారు.