'BRO' ఫస్ట్ సింగిల్..స్పీకర్స్ పగిలిపోవడం ఖాయం

'BRO' ఫస్ట్ సింగిల్..స్పీకర్స్ పగిలిపోవడం ఖాయం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో.. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej) కాంబోలో వస్తున్న మూవీ 'BRO'.. తాజాగా మరో అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ఇవాళ (జూలై 8న) సాయంత్రం విడుదల చేయనున్నారు. మై డియర్ మార్కండేయ అంటూ సాగే ఈ సాంగ్ శనివారం సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయనున్నారు మేకర్స్. 

ఈ సాంగ్ 4 నిమిషాల 23 సెకన్ల తో స్పీకర్స్ పగిలిపోవడం ఖాయం అంటున్నారు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. మై డియర్ బ్రదర్స్ గెట్ రెడీ అంటూ ఫ్యాన్స్ నెట్టింట్లో ట్వీట్స్ పెడుతున్నారు. 

ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తుండగా..ఈ చిత్రంలో కేతికా శర్మ, ప్రియాప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ మూవీ వినోదయ సీతంకు రీమేక్‌గా సముద్రఖని(Samuthirakani) బ్రో మూవీని తెరకెక్కిస్తున్నారు. త్రివిక్రమ్(Trivikram) మాటలు అందిస్తుండగా..పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory)  బ్యానర్ పై నిర్మిస్తున్నారు.