భోళా శంకర్.. అన్నా చెల్లెలి రిలేషన్‌‌‌‌ హైలైట్‌‌‌‌గా

భోళా శంకర్..  అన్నా చెల్లెలి రిలేషన్‌‌‌‌ హైలైట్‌‌‌‌గా

స్టార్‌‌‌‌‌‌‌‌ హీరోలకి జంటగా నటించాల్సిన హీరోయిన్‌‌‌‌... చెల్లెలి పాత్రలో నటించిందంటే ఆ సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. అలాంటిదే ‘భోళా శంకర్’ చిత్రంపై ఉంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటించింది. బ్రదర్ అండ్ సిస్టర్‌‌‌‌‌‌‌‌గా వీళ్లిద్దరి రిలేషన్‌‌‌‌షిప్ సినిమాకు హైలైట్‌‌‌‌ అవుతుందంటూ మరింత క్యూరియాసిటీని పెంచుతున్నారు మేకర్స్. 

‘చిరంజీవి, కీర్తి సురేష్‌‌‌‌ల మధ్య వచ్చే సీన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయి. వీరిద్దరూ బ్యూటీఫుల్  కెమిస్ట్రీని పంచుకున్నారు. రెండు పాత్రల మధ్య హ్యుమర్, డ్రామా, ఎమోషన్స్  ఉంటాయి. కాబట్టి.. ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది’ అని శనివారం దర్శక నిర్మాతలు తెలియజేశారు. దీంతోపాటు విడుదల చేసిన  చిరు, కీర్తిల  కొత్త స్టిల్‌‌‌‌ ఇంప్రెస్ చేస్తోంది. రీసెంట్‌‌‌‌గా విడుదలైన ట్రైలర్‌‌‌‌‌‌‌‌కు ట్రెమండెస్ రెస్పాన్స్ వస్తోంది. 

తమన్నా హీరోయిన్‌‌‌‌గా నటించిన ఈ చిత్రంలో సుశాంత్ కీలక పాత్ర పోషించాడు.  రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, సురేఖావాణి, శ్రీముఖి, రష్మీ గౌతమ్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా విడుదల కానుంది.