
అడవి పందులు వెంటపడ్డయని నీటిలో దూకిన్రు
అన్నదమ్ముల దుర్మరణం
కామారెడ్డి జిల్లా నారాయణగూడెం తండాలో విషాదం
లింగంపేట, వెలుగు: అడవి పందులను తప్పించుకోవడానికి గుంతలో దూకిన ఇద్దరు చిన్నారులు నీట మునిగి మృతిచెందారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బానాపూర్పంచాయతీ పరిధిలోని నారాయణగూడెం తండా సమీపంలో మంగళవారం జరిగింది. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం.. రమావత్ లచ్చిరాం, బుజ్జిల కొడుకులు జగన్(10), శివ(8) మంగళవారం ఉదయం మేకలను మేపేందుకు ఫారెస్టుకు ఆనుకుని ఉన్న వ్యవసాయ పొలానికి వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అడవి పందులు వీరిపై దాడి చేసేందుకు రావడంతో అన్నదమ్ములు ఇద్దరూ పరుగెత్తుకుంటూ పొలం పక్కన ఉన్న ట్రెంచ్(అటవీ ఆఫీసర్లు తీసిన గుంత)లో దూకారు. కందకం లోతుగా ఉండడంతో వీరికి ఈత రాక నీట మునిగి మృతిచెందారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కొడుకులు కన్పించకపోవడంతో ఆందోళనకు గురైన తండ్రి లచ్చిరాం కందకం వెంబడి వెతకగా ఇద్దరు పిల్లలు మృతదేహాలు కనిపించాయి. స్థానిక ఇన్చార్జి ఎస్సై కృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. అన్నదమ్ములిద్దరూ చనిపోవడంతో నారాయణగూడెం తండాలో విషాదం నెలకొంది.
For More News..