సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు : ఎంపీ వద్దిరాజు

సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు :  ఎంపీ వద్దిరాజు
  • రాజ్య సభ చర్చలో పాల్గొన్న ఎంపీ వద్దిరాజు

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ప్రవేశ పెట్టిన సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు –2025 కు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. గురువారం రాజ్యసభలో  సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ)బిల్లు -2025 జరిగిన చర్చలో ఆ పార్టీ తరపున ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సామాజిక కోణంలో కాకుండా ఆర్థిక సంబంధమైన అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతునిస్తుందన్నారు. 

తెలంగాణ జనాభాలో గణనీయమైన సంఖ్యలో ఉన్న గౌడ కులస్తుల సంక్షేమంలో భాగంగా మద్యం దుకాణాల కేటాయింపుల్లో 15% ప్రత్యేక రిజర్వేషన్లను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని సభకు తెలిపారు. మద్యం అమ్మకాల పర్యవేక్షణ, తనిఖీలు, నియంత్రణ లేని కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు.