రాజకీయాలకు అతీతంగా సమస్యలు పరిష్కరించాం ; బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్

రాజకీయాలకు అతీతంగా సమస్యలు పరిష్కరించాం ; బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్

సికింద్రాబాద్, వెలుగు: రాజకీయాలకు అతీతంగా సికింద్రాబాద్ సెగ్మెంట్​లో అన్ని సమస్యలను పరిష్కరించామని బీఆర్ఎస్ అభ్యర్థి తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు. అన్ని వర్గాల వారు నివసించే ప్రాంతంగా సికింద్రాబాద్ కు ప్రత్యేకత ఉందన్నారు. గురువారం తార్నాక డివిజన్ లాలాపేటలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్లారు.  

ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో అన్ని మతాల పండుగలకు గుర్తింపు ఉందన్నారు. లాలాపేటలో రూ. కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేశామన్నారు. రోడ్డు, కల్వర్టు విస్తరణ పూర్తయ్యిందన్నారు. లాలాపేట,   లేబర్ అడ్డా, భజన సమాజం, వివేకానంద విగ్రహం, విద్యా మందిర్ స్కూల్, ఆర్య నగర్ ప్రాంతాల్లో పద్మారావు గౌడ్ నిర్వహించిన పాదయాత్రకు జనాల నుంచి మంచి స్పందన లభించింది. సీతాఫల్ మండి డివిజన్ టీడీపీ జీవీ కృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు గురువారం బీఆర్ఎస్ లో చేరారు. వారికి పద్మారావు గౌడ్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Also Read :- బ్రిటన్​ రాజకీయాల్లో కొత్త మలుపు