కంటికి రెప్పలా కాపాడుకుంటా : చింత ప్రభాకర్

కంటికి రెప్పలా కాపాడుకుంటా :  చింత ప్రభాకర్

కొండాపూర్, వెలుగు : తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటానని బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ తెలిపారు. సోమవారం మండలంలోని గొల్లపల్లి, మునిదేవునిపల్లి, మాన్ సన్ పల్లి, సీహెచ్ కోనాపూర్, మాందాపూర్, గంగారం శివన్న గూడెం లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు తాగునీటి కోసం మహిళలు తీవ్ర ఇబ్బందులు పడేవారన్నారు. 

సీఎం కేసీఆర్ ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చి కష్టాలు తీర్చారన్నారు. సంక్షేమంలో బీఆర్ఎస్ దేశంలోనే నెంబర్ వన్ పార్టీగా నిలిచిందన్నారు. ఐదేండ్లు ఎమ్మెల్యేగా లేకున్నా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేస్తూ ఆపదొస్తే ఆదుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తనను నిండు మనసుతో ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. 

ALSO READ : 9 ఏండ్లు పట్టించుకోని మోదీ.. ఇప్పుడు ప్రేమను ఒలకబోస్తున్నరు ; పుష్ప లీల

కార్యక్రమంలో పార్టీ మండల ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం, విఠల్,  శ్రీధర్ రెడ్డి, మల్లేశం, నరసింహారెడ్డి, నగేశ్, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.