ఫసియుద్దీన్ ఓటర్లను ప్రభావితం చేస్తున్నరు.. పోలీసులకు బీఆర్ఎస్ ఫిర్యాదు

ఫసియుద్దీన్ ఓటర్లను ప్రభావితం చేస్తున్నరు.. పోలీసులకు బీఆర్ఎస్ ఫిర్యాదు

జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని బీఆర్​ఎస్​లీడర్లు, ఎమ్మెల్సీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, శంభీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో బోరబండ పీఎస్​లో కార్పొరేటర్ ఫసి యుద్దీన్ పై సర్దార్ కుటుంబం ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో మంత్రులతో కలిసి ప్రచారంలో  పాల్గొంటూ ఓటర్లను బెదిరిస్తున్నారని సీఐ దృష్టికి తీసుకువెళ్లారు.