మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ తన హయంలో పనులకు ప్రపోజల్స్ చేసుడు తప్పితే పనులు చేయలేదని గ్రేటర్ వరంగల్మేయర్ గుండు సుధారాణి, కాంగ్రెస్ కార్పొరేటర్లు మండిపడ్డారు. నయీంనగర్ బ్రిడ్జి వద్ద సోమవారం మీడియాతో మాట్లాడారు. నయీంనగర్ నాలా, బ్రిడ్జి పనులకు 2022లోనే శాంక్షన్ వచ్చినా పనులు చేయకపోవడంతో 2023లో మరోసారి వరదలు వచ్చి కాలనీలు నీట మునిగాయన్నారు.
తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన రాజేందర్‌రెడ్డి నాలా, బ్రిడ్జి పనులపై ఫోకస్ పెట్టారన్నారు. స్మార్ట్ సిటీ స్కీంలో ప్రపోజల్స్ పంపడం తప్పించి ఏండ్లు గడిచినా పనులు మొదలుపెట్టకపోవడంతో ఫండ్స్ వెనక్కి పోకుండా చూశారన్నారు. గత 8, 9 నెలల్లోనే ఎన్నో అడ్డంకులను దాటుకుని నయీంనగర్ నాలా, బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. ఆమె వెంట కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్ ఉన్నారు.