మెడికవర్ లో అడ్వాన్స్ డ్ పెయిన్ మేనేజ్‌మెంట్ క్లినిక్

మెడికవర్ లో అడ్వాన్స్ డ్ పెయిన్ మేనేజ్‌మెంట్ క్లినిక్

హనుమకొండ, వెలుగు: దీర్ఘకాలిక నొప్పులతో బాధ పడుతున్న రోగులకు ప్రత్యేక చికిత్స అందించేందుకు వరంగల్ లోని మెడికవర్  హాస్పిటల్ లో అడ్వాన్స్​డ్  పెయిన్  మేనేజ్‌మెంట్  క్లినిక్ ను ప్రారంభించినట్లు ఆసుపత్రి స్పెషలిస్ట్  పెయిన్  ఫిజీషియన్  డా.వాసు ప్రకాశ్, క్రిటికల్  కేర్  వైద్యుడు డా.దీపక్  తెలిపారు. హంటర్  రోడ్డులోని మెడికవర్  హాస్పిటల్ లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ క్లినిక్ లో  వెన్ను, నరాలు, మోకాళ్లు, క్యాన్సర్‌  నొప్పులతో బాధపడుతున్న వారికి ప్రత్యేక వైద్య సేవలు అందిస్తామన్నారు.

డా.వాసు ప్రకాశ్, డా.దీపక్  ఆధ్వర్యంలో డాక్టర్లు ప్రతి రోగిని పరిశీలించి, చికిత్స ప్రణాళికను రూపొందిస్తారని తెలిపారు.  అవసరాన్ని బట్టి సంబంధిత స్పెషాలిటీ విభాగాల సహకారంతో ట్రీట్​మెంట్  చేస్తారని చెప్పారు. క్యాన్సర్  నొప్పితో బాధపడుతున్న రోగుల జీవన ప్రమాణాన్ని మెరుగు పరిచేందుకు, పెయిన్, పాలియేటివ్  మెడిసిన్  సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. క్లినిక్‌లో అడ్వాన్స్​డ్  నాన్- సర్జికల్, మినిమల్లీ ఇన్వేసివ్  విధానాలు, ముఖ్యంగా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్  వంటి చికిత్స అందిస్తామని చెప్పారు.