రవీంధ్రభారతిలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు జరిగాయి. తెలంగాణ తొలిదశ ఉద్యమంలోనే బాపూజీ తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఏర్పడేంత వరకు తాను ఎలాంటి పదవి తీసుకొనని చెప్పిన నాయకుడిని గత ప్రభుత్వం అవమానపరిచిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన అంత్యక్రియల సమయంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు ఎవరూ హాజరుకాలేదన్నారు. పద్మశాలి కులానికి చెందిన వారు రాజకీయాల్లో పెద్దగా లేరని.. ఈ విషయంలో కుల సంఘాల నేతలు ఆలోచించాలన్నారు.
ALSO READ | కొండాలక్ష్మణ్ బాపూజీకి సీఎం రేవంత్, ఎమ్మెల్యే వివేక్ నివాళి
కొండా లక్ష్మణ్ బాపూజీని ఎవరూ సపోర్ట్ చేయకపోయినా .. ఆయనకు ఎవరూ అవకాశం ఇవ్వకపోయినా.. ఆయనే అవకాశాను ఎతుక్కుంటూ గొప్పనాయకుడు అయ్యారని మంత్రి తెలిపారు. బాపూజీ వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానన్నారు. సిరిసిల్ల చేనేత చీరలు ఆపేస్తారని విపక్షాలు దుష్ర్పచారం చేస్తున్నారని.. తమ ప్రభుత్వం చేనేత వస్త్రాలను వాడేందుక కట్టుబడి ఉందన్నారు.
